లోక్‌సభ ఎన్నికలు 2024: ఎంపీల పనితీరుపై నమో యాప్ లో మోడీ సర్వే

ఎంపీల పనితీరుపై నేరుగా పౌరులు తమ అభిప్రాయాన్ని పంచుకోనే విధంగా  నమో యాప్ లో జన్ మ్యాన్ సర్వేను చేపట్టారు.
 

loksabha elections 2024:namo app launches jan man survey pm modi getting info about mps lns


న్యూఢిల్లీ: వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  తన ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అంతేకాదు  ఎంపీల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.  ప్రజల్లో ఆయా ఎంపీలపై  ఉన్న ఫీడ్ బ్యాక్ పై  ఆరా తీయనున్నారు.ఇందు కోసం  నమో యాప్ లో  జన్ మ్యాన్ (Jan-Man- Survey ) సర్వేను ప్రారంభించారు. 

ఈ సర్వే ద్వారా ఎంపీలు, ప్రభుత్వ పనితీరును మోడీ నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంది. ఈ సర్వేలో పలు ప్రశ్నలున్నాయి. ఆయా ఎంపీలపై ప్రజల అభిప్రాయాలను  ఈ సర్వే ద్వారా తెలుసుకొనే అవకాశం ఉంది.  ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. 


బీజేపీ ఎప్పుడూ  టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. సోషల్ మీడియాలో  ప్రజలతో కనెక్ట్ కావడంలో ముందుంటారు. టెక్నాలజీ వినియోగంలో మోడీ ఎప్పుడూ ముందుంటారు. ప్రధాని మోడీ దేశ ప్రజలతో నేరుగా నమో యాప్ ద్వారా సంభాషిస్తుంటారు.

నమో యాప్ లో అడిగే ప్రశ్నలు

మోడీ ప్రభుత్వ పనితీరును మీరు ఎలా అంచనా వేస్తారు?
 
మీరు గతం కంటే మీ భవిష్యత్తు గురించి మరింత ఆశాజనకంగా భావిస్తున్నారా?

ప్రపంచంలో భారతదేశం ఎదుగుతున్న స్థాయి గురించి మీ అభిప్రాయం ఏమిటీ?

కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై  రేటింగ్ ఇవ్వాలని కోరారు. 

మోడీ ప్రభుత్వ పథకాల వల్ల మీరేమైనా లబ్ది పొందారా

మీరు మీ ఎంపీని చేరుకోగలుగుతున్నారా, క్షేత్రస్థాయిలో మీ ఎంపీ  పర్యటిస్తున్నారా ?
 
మీ ఎంపీ చొరవ గురించి మీకు తెలుసా ?

మీ ఎంపీ పని పట్ల సంతృప్తిగా ఉన్నారా ?

మీ ప్రాంతంలో మీ ఎంపీకి ఆదరణ ఉందా?

మీ ప్రాంతంలో  అత్యంత ప్రజాదరణ పొందిన ముగ్గురు బీజేపీ నాయకుల పేర్లను చెప్పండి

మీ నియోజకవర్గంలో కిందివారి స్థితితో మీ సంతృప్తి రేటుపై  కామెంట్ చేయాలని కోరారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు, వైద్యం, విద్య, రేషన్ సంబంధిత అంశాలు, ఉద్యోగావకాశాలు, శాంతి భద్రతలు, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు.

ఓటు వేసే సమయంలో మీకు ఏ సమస్య చాలా ముఖ్యమైంది?

మీరు 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలనుకుంటున్నారా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios