పేరు మార్చుకున్న దేశాలివే!

India vs Bharat Row: దేశం పేరును ఇండియా నుండి భారత్‌గా మార్చాలనే చర్చ జరుగుతోంది. G20 అతిథులకు పంపిన ఆహ్వాన లేఖ ఈ విషయాన్ని ఎత్తి చూపింది. ఇప్పటివరకు ఏయే దేశాలు తమ పేర్లను మార్చుకున్నాయో తెలుసుకుందాం.

list of countries that changed thier names KRJ

India vs Bharat Row: దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న విందుకు జీ20 అతిథులను ఆహ్వానించేందుకు పంపిన ఆహ్వాన లేఖలో ఇండియా అని కాకుండా భారత్ అని ముద్రించడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. నిజానికి జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన ప్రముఖులు కూడా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజరుకానున్నారు. అయితే.. ఈ విందుకు పంపిన అధికారిక ఆహ్వాన లేఖలో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అని కాకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ' అని పేర్కొనబడింది. అధికారిక ఆహ్వాన లేఖలో దేశం పేరును మార్చడం ఇదే మొదటిసారి. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే.. గతంలో కూడా ప్రపంచంలోని చాలా దేశాలు తమ పేర్లను మార్చుకున్నాయి. అందుకు పలు కారణాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో పేరు మార్చుకున్న దేశాల గురించి తెలుసుకుందాం..  

1. టర్కీ-తుర్కియే: 

టర్కీ తమ దేశం పేరును తుర్కియేగా మారుస్తున్నట్లు అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ గతేడాది ప్రకటించారు. తుర్కియే అనే పేరు తమ సంస్కృతి, నాగరికత, విలువలకు అద్దంపడుతుందని ఆ దేశ అధ్యక్షుడు చెప్పారు. తమ సాంస్కృతిక మూలాలకు మరింత చేరువయ్యేందుకు తమ దేశం పేరును మార్చుకున్నట్టు తెలిపారు. 

2. చెక్ రిపబ్లిక్ - చెకియా : 

సెంట్రల్‌ యురోపియన్‌ దేశం చెక్‌ రిపబ్లిక్‌.. ఏప్రిల్ 2016లో చెక్ రిపబ్లిక్ తన పేరును చెకియాగా మార్చుకుంది. స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో, గ్లోబల్ మార్కెట్‌లో దేశాన్ని సులువుగా గుర్తించేలా వీలుగా పేరును మార్చుకొన్నట్టు వెల్లడించింది.
 
3. స్వాజిలాండ్‌-ఈశ్వతిని: 

ఆఫ్రికన్ దేశం స్వాజిలాండ్ ఏప్రిల్ 2018లో తన పేరును ఎస్వతినిగా మార్చుకుంది.  ఈశ్వతిని అంటే 'స్వాజీల భూమి'. స్వాజిలాండ్‌, స్విట్జర్లాండ్‌ దేశాల పేరు చూసి ప్రజలు గందరగోళానికి గురవుతారు. కాబట్టి ఈశ్వతిని దాని పేరును మార్చారు.

4.హాలండ్‌-నెదర్లాండ్స్‌: 

హాలండ్‌ తన పేరును నెదర్లాండ్స్‌గా మార్చుకొన్నది. పబ్లిసిటీ కోసం జనవరి 2020లో పేరు మార్చుకొన్నట్టు ప్రకటించింది. ఈ చర్యతో దేశం తనను తాను బహిరంగ, వినూత్న, సమ్మిళిత దేశంగా చూపించుకోవాలని భావిస్తోంది. 

5. మాసిడోనియా - రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మాసిడోనియా :

ఈ దేశం NATOలో చేరడం, గ్రీస్‌లోని ఒక ప్రాంతం పేరు మాసిడోనియా కారణంగా మాసిడోనియా తన పేరును మార్చుకుంది. ఫిబ్రవరి 2019లో మాసిడోనియా నుంచి రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మాసిడోనియాగా మారింది. అయితే.. తమ పౌరులను నార్త్‌ మాసిడోనియన్లు అని కాకుండా మాసిడోనియన్లుగానే పిలుపువాలని ఆ దేశం కోరుకుంటుంది. 

6. సిలోన్- శ్రీలంక: 

1972లో సిలోన్‌ తన పేరును శ్రీలంకగా మార్చుకొన్నది. పోర్చుగీస్, బ్రిటీష్ వలస, పాలన చారిత్రక అవశేషాలను తొలగించడానికి , దాని స్వాతంత్ర్యాన్ని చూపించడానికి  సిలోన్  తన పేరును శ్రీలంకగా మార్చుకుంది. 2011లో ప్రభుత్వ వినియోగం నుంచి సిలోన్‌ పేరును పూర్తిగా తొలగించింది. శ్రీలంక అంటే సింహళీ భాషలో "ప్రకాశవంతమైన భూమి" అని అర్థం. 

7. సియామ్ - థాయిలాండ్:

థాయిలాండ్‌ను ఇంతకుముందు సియామ్ అని పిలిచేవారు. ఇది సంస్కృతం నుండి ఉద్భవించింది. ఆ తర్వాత 1939లో దేశం పేరు థాయ్‌లాండ్‌గా మార్చబడింది. ఆగ్నేయాసియాలో పెరుగుతున్న పాశ్చాత్య వలసవాద ప్రభావం నేపథ్యంలో ఆ దేశం తన ఐక్యత, గుర్తింపును నొక్కిచెప్పడం లక్ష్యంగా పెట్టుకుంది. "థాయిలాండ్" అంటే "స్వేచ్ఛాభూమి" అని అర్థం.   

8. పర్షియా-ఇరాన్‌: 

ఇరాన్ తన పేరును 1935లో పర్షియా నుండి ఇరాన్‌గా మార్చుకుంది. ఈ విధంగా దేశానికి, ఆ దేశ పౌరులకు కొత్త గుర్తింపు వచ్చింది. ఈ రోజు కూడా దేశం పేరును పర్షియా నుండి ఇరాన్‌గా మార్చడం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. 

9. బర్మా - మయన్మార్ : 

1989లో బర్మా అధికారికంగా దాని పేరును మయన్మార్‌గా మార్చింది. ఈ దక్షిణాసియా దేశాన్ని బర్మా అని పిలుస్తారు.

10. తూర్పు పాకిస్తాన్ - బంగ్లాదేశ్ :

1971లో తూర్పు పాకిస్తాన్ క్రూరమైన యుద్ధం తరువాత పశ్చిమ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించింది. దీని ఫలితంగా బంగ్లాదేశ్ కొత్త దేశం ఆవిర్భవించింది. పేరు,  హోదాలో మార్పు రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక, భాషా, రాజకీయ వ్యత్యాసాలను ప్రతిబింబిస్తుంది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ముగింపు పలికింది. 

>> నరేంద్ర మోడీ ప్రభుత్వం నేతృత్వంలోని రాబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో  ఇండియా తన పేరును "భారత్"గా మార్చే ప్రతిపాదన ఉండవచ్చు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios