చదువుకోవాల్సిన వయసులో కొందరు స్టూడెంట్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. కర్ణాటకలోని ఓ ప్రైవేట్ హోంలో కొందరు కాలేజీ స్టూడెంట్లు కలిసి లిప్ లాక్ పోటీలు నిర్వహించారు. ఓ జంటకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

కర్ణాటకలోని దక్షిణ కోస్తా జిల్లా మంగళూరు పట్టణంలోని ఓ నివాసంలో ఓ ప్ర‌ముఖ కళాశాల‌కు చెందిన ఇద్ద‌రు విద్యార్థులు మిగితా పిల్ల‌ల ముందు లిప్ లాక్ లో మునిగిపోయారు. వీరిద్ద‌రూ కాలేజీ యూనిఫామ్ లో ఉన్నారు. అయితే ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అక్కడే ఉన్న ఓ కుర్రాడు దీనిని రికార్డ్ చేసి వారం రోజుల క్రితం వాట్సాప్‌లో వీడియో పెట్టాడు. ఈ విషయం కళాశాల యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీంతో వారిద్ద‌రినీ కాలేజ్ నుంచి స‌ప్పెండ్ చేశారు. వీడియో తీసిన మ‌రో బాలుడిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

President of India : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంత జీతం తీసుకోబోతున్నారు, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?

వైరల్ అయిన వీడియోలో అనేక మంది స్టూడెంట్లు యూనిఫామ్ లు వేసుకొని ఉన్నారు. అయితే ఇందులోని ఓ జంట ఒక‌రినొక‌రు కిస్ చేసుకుంటుండ‌గా.. మ‌రి కొంద‌రు క్యాజువల్ గానే ఉన్నారు. ఒక అమ్మాయి తన కాలేజీ స్నేహితుడి ఒడిలో పడుకుంది. అబ్బాయిలలో ఒకరు తదుపరి జంటను ఈ లిప్ లాక్ కోసం పిల‌వ‌డం వినిపిస్తోంది. కాగా విద్యార్థులు ప్రముఖ కళాశాలకు చెందినవారని, ఈ వీడియో సాంప్రదాయ కోస్తా జిల్లాను కదిలించిందని, ఇది రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల ఆందోళనలను కూడా పెంచిందని వర్గాలు వెల్ల‌డించాయి. 

ఒడిశాలో కలవరపెడుతున్న కలరా.. ఎనిమిదిమంది మృతి..120 మందికి అస్వస్థత..

అయితే ఈ ఘ‌ట‌న‌పై మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్. శ‌శికుమార్ స్పందించారు. మంగళూరులోని ఓ ఫ్లాట్‌లో ఆరు నెలల క్రితం ఈ ఘటన జరిగిందని ఆయ‌న గురువారం తెలిపారు. అక్క‌డ లిప్ లాక్ ఛాలెంజ్ పోటీలు నిర్వ‌హించార‌ని తెలిపారు. అక్కడే ఉన్న ఓ కుర్రాడు వారం రోజుల క్రితం వాట్సాప్‌లో వీడియో పెట్టాడ‌ని, ఈ విషయం పాఠశాల యాజమాన్యం దృష్టికి వచ్చిందని, అధికారులు విద్యార్థులను హెచ్చరించి సస్పెండ్ చేశారని తెలిపారు. వీడియో తీసిన బాలుడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని శశికుమార్ చెప్పారు.

వామ్మో.. మళ్లీ స్వైన్ ఫ్లూ కలవరం.. ఉత్తరప్రదేశ్‌లో పాజిటివ్ కేసు నమోదు

ఆ వీడియోలో కాలేజీ అబ్బాయి, అమ్మాయి కలిసి వచ్చి ఉద్వేగంగా కిస్ చేసుకుంటున్నారు. వారిని చూడగానే మిగిలిన విద్యార్ధులు కూడా వారిని ఉత్సాహపరిచారు. విద్యార్థుల బృందం తమ మధ్య లిప్‌లాక్ పోటీని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లిప్ లాక్ పోటీలో విద్యార్థులు డ్రగ్స్ సేవించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.