భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. దేశంలోని మొదటి గిరిజన, రెండవ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు. రాష్ట్రపతికి ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి. జీతం, పదవీవిరమణ చేశాక అందే సదుపాయాల వివరాలు..

ఢిల్లీ : ఎన్డీయే అభ్యర్థి Draupadi Murmu విపక్షాల అభ్యర్థి Yashwant Sinhaపై Presidential Election 2022లో విజయం సాధించి దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రామ్ నాథ్ కోవింద్ దేశ రాష్ట్రపతి. అతని పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దేశంలోని మొదటి గిరిజన, రెండవ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము జూలై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ముకు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి. ఆమె ఎంత జీతం ఎంత? అనే విషయాలు...

అక్టోబర్ 2017 నుండి, రాష్ట్రపతి నెలవారీ జీతం నెలకు రూ.1.5 లక్షల నుండి రూ.5 లక్షలకు పెరిగింది. రాష్ట్రపతిగా ఎన్నికైన వారికి వైద్యం, గృహవసతి సహా అన్ని సౌకర్యాలు లభిస్తాయి. అంతే కాకుండా రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత నెలకు ఒకటిన్నర లక్షల రూపాయల పెన్షన్ కూడా అందుతుంది.

భారత రాష్ట్రపతి : 'ప్రథమ పౌరుడి' ప్రత్యేకతలు
- 5 లక్షల నెల జీతం... (పన్ను ఉచితం)
- ఉచిత వైద్యం, పరీక్షలు సహా అన్ని సౌకర్యాలు
- రైసినా హిల్స్‌లో ఉచిత వసతి
- రాష్ట్రపతికి ప్రత్యేక కారు. (కస్టమ్ బిల్ట్ మెర్సిడెస్ బెంచ్ S600)
- రాష్ట్రపతి భవన్ ఉద్యోగుల జీతాల కోసం కూడా పెద్ద మొత్తంలో డబ్బు కేటాయిస్తారు
- పదవీ విరమణ తర్వాత నెలకు రూ. 1.5 లక్షలు పెన్షన్
- రెండు ల్యాండ్‌లైన్లు, ఒక మొబైల్ ఫోన్ ఉచితం
- వ్యక్తిగత భద్రతా గార్డులతో సహా భద్రతా వ్యవస్థ
- సహచరుడితో ఉచిత విమాన, రైలు ప్రయాణం

రాష్ట్రపతి ఎన్నికల్లో తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి అయ్యారు. ద్రౌపది ముర్ము ఒక గిరిజన కమ్యూనిటీ నుండి భారతదేశ రాష్ట్రపతి అయిన మొదటి భారతీయురాలు. గత సోమవారం, రాష్ట్రపతి ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నిన్న, జూలై 21న ఫలితం వెలువడింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతిగా ముర్ము జూలై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

భారత నూతన రాష్ట్రపతిగా గిరిజన మహిళ... ద్రౌపది ముర్ముకు అభినందనల వెల్లువ (ఫోటోలు)