Asianet News TeluguAsianet News Telugu

elections 2022: మమతా బెనర్జీ తీరు ఉత్తర కొరియా నియంత కిమ్‌ లా ఉంది: బీజేపీ

elections 2022: వ‌చ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లతో పాటు కోల్‌క‌తాలో ఆదివారం జ‌రిగిన న‌గ‌ర పాల‌క ఎన్నిక‌లు నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. మ‌మ‌తా బెన‌ర్జీ తీరు ఉత్తర కొరియా అధినేత, నియంత కిమ్ జోంగ్ ఉన్ లా ఉందంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది బీజేపీ. 
 

likens Mamata Banerjee to North Korea leader Kim Jong-un : Suvendu Adhikari
Author
Hyderabad, First Published Dec 20, 2021, 1:40 PM IST

elections 2022:  తృణ‌మూల్ కాంగ్రెస్, బీజేపీల మ‌ధ్య మాటల యుద్ధం కొన‌సాగుతోంది. వ‌చ్చే ఏడాది ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆయా పార్టీల మ‌ధ్య వార్ మ‌రింత ముదిరింది. ఆదివారం నాడు కోల్‌క‌తా న‌గ‌ర పాల‌క ఎన్నిక‌లు జ‌రిగాయి. ప‌లు చోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు సైతం చోటుచేసుకున్నాయి. దీనిపై సోమ‌వారం నాడు బీజేపీ స్పందిస్తూ.. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమెను ఉత్తర కొరియా అధినేత, నియంత కిమ్ జోంగ్‌తో పోల్చింది.  కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలపై బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. మ‌మ‌తా బెన‌ర్జీ స‌ర్కారుపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.  ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్‌తో పోల్చారు. ఆదివారం కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోల్‌కతా పోలీసుల కనుసన్నల్లోనే ఓట్లను దోచుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ సువేందు అధికారి డిమాండ్ చేశారు.

Also Read: Pawan Kalyan: క‌నీసం ప్ల‌కార్డులైనా ప‌ట్టుకోండి: వైకాపాకు పవన్ చుర‌క‌లు

కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని ఆరోపించిన సువేందు అధికారి.. ఈ విషయమై సోమ‌వారం నాడు రాష్ట్ర గవర్నర్‌ను సైతం కలిశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వెన్నుపోటు పొడిచిన కమిషనర్‌‌గా ఉన్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.  మమతా బెనర్జీ తీరు ఉత్తర కొరియా  అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పోలినట్లుగా ఉందన్నారు.  కోల్‌కతా పోలీసులపై కూడా సువేందు అధికారి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కోల్‌క‌తా పోలీసులు తృణ‌మూల్ కాంగ్రెస్ క్యాడ‌ర్ లా ప‌నిచేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతున్న టీఎంసీ గూండాలను మ‌మ‌తా బెన‌ర్జీ ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నార‌ని తెలిపారు. దీనికి అనుగుణంగా కోల్‌క‌తా పోలీసుల‌కు ఆదేశాలిచ్చారంటూ దుయ్య‌బ‌ట్టారు. “మ‌మ‌తా బెన‌ర్జీ సూచ‌న‌ల‌కు అనుగుణంగా పోలీసులు  ఇలా పని చేస్తున్నారు. దాడులు జరుగుతుంటే రిక్తహస్తాలతో చూస్తూ ఉంటున్నారు. అంతే కాదు తృణ‌మూల్  గూండాలను రక్షించేపనిలో పోలీసులు ఉన్నారు. 

Also Read: Omicron variant: క‌ల‌వ‌ర‌పెడుతున్న ఒమిక్రాన్‌.. కొత్త‌గా మ‌రో 8 కేసులు.. మొత్తం 153

కోల్‌క‌తా న‌గ‌ర పాల‌క ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరుపై ఆగ్ర‌హం వ్యక్తం చేసిన సువేందు అధికారి.. ఈ ఎన్నిక‌ల్లో  30-40 శాతం బయటి ఓటర్ల మద్దతుతో ఓటింగ్ జ‌రిగింద‌ని తెలిపారు. తృణ‌మూల్ కాంగ్రెస్ కు చెందిన గూండాలు ఒక్కొక్క‌రు ఎనిమిది నుంది ప‌ది ఓట్లు వేశార‌నీ, దీనికి సంధించి త‌న వ‌ద్ద ఆధారాలు స‌తైం ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇదిలావుండ‌గా, కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని  144 వార్డుల్లో  ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి.  రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాత్కాలిక డేటా ప్రకారం పోలింగ్ ప్రారంభమైన మూడు గంటల్లో కేవలం 9.14 శాతం  పోలింగ్ మాత్రమే నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.17 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ప‌లు చోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి మొత్తం 72 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కోల్‌కతాలోని సీల్దా, ఖన్నా ప్రాంతాల్లో రెండు నాటు బాంబులు విసిరిన సంఘటనల‌కు సంబంధించి నిందితుల‌ను పోలీసులు గుర్తించారు. వారిలో ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. మిగ‌తా వారిని త్వ‌ర‌లోనే అరెస్టు చేస్తామ‌ని తెలిపారు. వారిపై త‌గిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని ఎన్నిక‌ల అధికారులు తెలిపారు.

Also Read: Omicron :బ్రిట‌న్ లో ఒమిక్రాన్ పంజా.. ఒకే రోజు 90 వేల‌కు పైగా కొత్త కేసులు

Follow Us:
Download App:
  • android
  • ios