Pawan Kalyan: కనీసం ప్లకార్డులైనా పట్టుకోండి: వైకాపాకు పవన్ చురకలు
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పోరాటం మళ్లీ ఉధృతం అవుతున్నది. మరీ ముఖ్యంగా అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ తెరదీసింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ ఎంపీల తీరుపై మండిపడ్డారు.
Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ఇటీవలే 300 రోజులు దాటింది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాలు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ముందుకు సాగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు సిద్ధమవుతూ.. అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలు కలిసిరావాలని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిర్ణయం వెనక్కితీసుకోవాలని నిరసిస్తూ గళం వినిపిస్తున్నారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఉక్కుపరిశ్రమ ఉద్యోగులు చేస్తున్నపోరాటానికి తన మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. ప్రత్యక్ష పోరాటానికి దిగిన ఆయన.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సోషల్ మీడియా వేదిక డిజిటల్ క్యాంపెయిన్ ను సైతం నిర్వహిస్తున్నారు.
Also Read: Omicron variant: కలవరపెడుతున్న ఒమిక్రాన్.. కొత్తగా మరో 8 కేసులు.. మొత్తం 153
కేంద్రం తీసుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకునేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని జనసేన ప్రకటించింది. దీనిలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా సోమవారం మరో ట్వీట్ చేశారు. ఇందులో అధికార వైకాపా పార్లమెంట్ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకోవాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్… విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగాలు చేస్తామన్న వైసీపీ ఎంపీలు.. ప్లకార్డులు పట్టుకుంటే చాలని.. ప్రాణత్యాగాలంత త్యాగాలు అక్కర్లేదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read: Omicron :బ్రిటన్ లో ఒమిక్రాన్ పంజా.. ఒకే రోజు 90 వేలకు పైగా కొత్త కేసులు
ఇదిలావుండగా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రోజేఉ దీక్షకు సైతం దిగారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 12న 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష' పేరిట ఆయన ఒక రోజు దీక్ష చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు సైతం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు.. అఖిలపక్షాన్ని దేశరాజధాని ఢిల్లీకి తీసుకెళ్లాలని విశాఖ సభలో పవన్ డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో.. పవన్ కల్యాణ్ ఒక రోజు దీక్షకు దిగారు. ఈ దీక్షలో జనసేన మరో నేత Nadendla Manohar సైతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎంపీలపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులపై విమర్శలు గుప్పించారు నాదేండ్ల. రైతులు పండిస్తున్న వరి ధాన్యం విషయంలో తెలంగాణ ఎంపీలందరూ పార్లమెంట్ అవరణలో రైతుల కోసం బలంగా పోరాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారని నినదించారు అని నాదేండ్ల మనోహర్ అన్నారు. అయితే, తెలంగాణ పార్లమెంట్ సభ్యుల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీలోని 25 మంది ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్ అవరణలో ఎందుకు పోరాడటం లేదు. తెలంగాణ ఎంపీల మాదిరిగా మీరు ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడటం లేదు అని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Also Read: Omicron :బ్రిటన్ లో ఒమిక్రాన్ పంజా.. ఒకే రోజు 90 వేలకు పైగా కొత్త కేసులు