Asianet News TeluguAsianet News Telugu

సామాన్యుడి మనోగతాన్ని ఆవిష్కరించిన లెజెండరీ పొలిటికల్ కార్టూనిస్ట్ ‘ఆర్కే లక్ష్మణ్’

సామాన్యుడి మనోగతాన్ని తన కార్టున్ల ద్వారా ఆవిష్కరించిన గొప్ప కార్టునిస్టుగా ఆర్కే లక్ష్మణ్ నిలిచారు. కామన్ మ్యాన్ పేరుతో కార్టూన్లు గీసిన ఆయన భారత ప్రభుత్వం ద్వారా ఎన్నో గొప్ప పురస్కారాలను అందుకున్నారు. 

Legendary political cartoonist 'RK Laxman' who discovered the soul of the common man
Author
New Delhi, First Published Aug 8, 2022, 3:16 PM IST

సాధారణ ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, వారి మనోగతాలకు ఎప్పుడూ చిత్రాలే వేదికగా నిలుస్తాయి. హాస్యం, ఆనందం, వినోదంతో కూడిన చిన్ననాటి కార్టూన్ లు అయితే ఆనంద‌ప‌రుస్తాయి. ఎంత పెద్ద సందేశాన్ని అయినా ఈ కార్టున్స్ సులువుగా అర్థం అయ్యేలా చేస్తాయి. ఒక్క క్ష‌ణంలో మ‌న‌స్సుకు హ‌త్తుకుంటాయి. చెప్పాల‌నుకున్న విష‌యం సూటిగా అప్ప‌జెప్పేస్తాయి. రాజ‌కీయ నాయ‌కుల ప‌ని తీరును, విధానాల‌ను విమ‌ర్శిస్తాయి.

భార‌తీయ క‌ళ‌ల‌కు ప్ర‌త్యేక స్థానాన్ని తీసుకొచ్చిన ‘ఎంఎఫ్ హుస్సేన్’

ఇలా చాలా మంది కార్టూనిస్టులు తమ అభిప్రాయాలను, రాజకీయంగా, సామాజికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను, ఆ స‌మ‌యంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను త‌మ స్కెచ్ ల ద్వారా రిప్రజెంట్ చేశారు. అయితే ఇలా అనేక అంశాల ప‌ట్ల సామాన్యుడి త‌రుఫున గొంతును వినిపించిన కార్టూనిస్ట్ ఎవ‌రిని అంటే మ‌న అంద‌రికీ గుర్తొచ్చే పేరు ఆర్కే లక్ష్మణ్‌దే.

ఆర్కే ల‌క్ష్మ‌ణ్ పూర్తి పేరు రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్.  ఆయ‌న 1921 సంవత్స‌రంలో మైసూర్‌లో జన్మించిన ఆయ‌న పార్ట్‌టైమ్ కార్టూనిస్ట్‌గా మొద‌ట‌గా త‌న వృత్తిని ప్రారంభించారు, త‌రువాత ఎక్కువ‌గా స్థానిక వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లలో పనిచేశాడు. అయితే ముంబైలోని ది ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా ఆయ‌న పూర్తి స్థాయి ఉద్యోగంలో మొద‌టి సారిగా చేరారు. 

బీరు తాగించలేదని ఫ్రెండ్‌ను కత్తితో పొడిచాడు.. ఎక్కడంటే?

ఆర్కే ల‌క్ష్మ‌ణ్ ప‌లు ర‌చ‌న‌ల‌కు కూడా రూపం ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్ర‌చురితం అయిన కామిక్ స్క్రిప్ట్ “You said it’’ లో నుంచి ఎంద‌రో ఆరాధించిన ‘కామన్ మ్యాన్’ కు జన్మనిచ్చింది. RK లక్ష్మణ్ మొదటగా రోహన్ వార్తాపత్రికలు, స్వరాజ్య, బ్లిట్జ్‌తో పాటు పలు మ్యాగజైన్ ల కోసం పని చేశారు. ఆయ‌న లోక‌ల్ న్యూస్ పేపర్ల కోసం, స్వతంత్ర కోసం రాజకీయ కార్టూన్లు కూడా గీశారు. లక్ష్మణ్ 1954లో ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ గ్రూప్ కోసం ‘‘గట్టు’’ అనే ఫేమస్ మస్కట్ ను కూడా సృష్టించారు. 

ఆర్కే ల‌క్ష్మ‌ణ్ క్రియేషన్స్‌లో టీవీ షో కోసం మాల్గుడి డేస్ అనుసరణ కోసం గీసిన స్కెచ్‌లు కూడా ఉన్నాయి. ఆయ‌న తన జీవిత చరిత్ర  ‘ది టన్నెల్ ఆఫ్ టైమ్‌’లో త‌న జీవితంలోని ప్రాపంచిక విషయాలను గ‌మ‌నిస్తూ ఎలా ప్రేర‌ణ పొందారో వివ‌రించారు. ఆయ‌న క‌ళ అసాధారణ‌మైన‌ది. కేవ‌లం సొంత శ్ర‌ద్ధ ద్వారానే అవి నేర్చుకున్నారు. 

వెంకయ్య నాయుడు పని విధానం స్పూర్తి దాయకం.. రాజ్యసభలో ప్రధాని మోదీ

ఆర్కే లక్ష్మ‌ణ్ ను భార‌త ప్ర‌భుత్వం జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్ (JLCCA) విభాగంలో1984లో ది రామన్ మెగసెసే అవార్డు ఇచ్చి స‌త్క‌రించింది. ఆయ‌న 2005లో భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను కూడా పొందారు. ఆయ‌న 1973లో పద్మభూషణ్ అవార్డు పొంద‌డంతో పాటు మ‌రెన్నో పుర‌స్కారాలను అందుకున్నారు. ఈ లెజెండరీ పొలిటికల్ కార్టూనిస్ట్ 2015వ తేదీ జనవరి 26న పూణేలో త‌న 93 ఏళ్ల వయసులో క‌న్నుమూశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios