ప్రముఖ న్యాయ నిపుణుడు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కన్నుమూత..
ప్రముఖ న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ (senior Supreme Court lawyer Fali S Nariman passes away) తన 95 ఏళ్ల వయస్సులో చనిపోయారు. గొప్ప న్యాయవాదిగా పేరొందిన ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఇచ్చి సత్కరించింది.
ప్రముఖ న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ ఇక లేరు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం మరణించారు. భారత న్యాయరంగంలో మహోన్నత వ్యక్తి అయిన నారిమన్ న్యాయవాద ప్రతిభ, న్యాయవాద వారసత్వాన్ని వదిలితన 95 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు.
వామ్మో.. జగజ్యోతి ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తి పత్రాలు.. వాటి విలువ తెలిస్తే.. (వీడియోలు)
ఫాలీ ఎస్ నారిమన్ నారిమన్ 1929 జనవరి 10న మయన్మార్ లోని పార్సీ కుటుంబంలో జన్మించారు. బాంబే హైకోర్టులో లా ప్రాక్టీస్ ప్రారంభించారు. 38 ఏళ్ల వయసులో హైకోర్టు న్యాయమూర్తిగా ఉండటానికి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. 1971 నుంచి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా, 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ సహా దేశ అత్యున్నత పౌర పురస్కారాలను నారీమన్ అందుకున్నారు.
ప్రముఖ న్యాయనిపుణుడి మృతి పట్ల మాజీ న్యాయశాఖ మంత్రి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ భారతదేశానికి గొప్ప పుత్రుడైన ఫాలీ నారీమన్ కన్నుమూశారు. ఆయన మన దేశంలోని గొప్ప న్యాయవాదుల్లో ఒకరు మాత్రమే కాదు, అన్నింటికీ మించి కొలోసస్ లా నిలిచిన అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకరు. ఆయన లేకుండా కోర్టు కారిడార్లు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు.
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. టిక్కెట్స్ ఇచ్చేందుకు కండక్టర్ సర్కస్ ఫీట్లు.. వీడియో వైరల్
నారిమన్ మరణంపై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. నారిమన్ మరణం ఒక శకానికి ముగింపు అని అన్నారు. ‘‘న్యాయ, ప్రజా జీవితంలో ఉన్నవారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే సజీవ లెజెండ్ నారిమన్. విభిన్న విజయాల కంటే తన సిద్ధాంతాలకే అచంచలంగా కట్టుబడి ఉన్నారు.’’ అని ఆయన పేర్కొన్నారు.