వామ్మో.. జగజ్యోతి ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తి పత్రాలు.. వాటి విలువ తెలిస్తే.. (వీడియోలు)
కాంట్రాక్టర్ నుంచి రూ.85 వేలు లంచం (Bribe) తీసుకుంటూ ఇచ్చిన ఎస్ఈ జగజ్యోతి ( Triber Welfare Executive Engineer Jagajyothi) ఇంట్లో భారీగా బంగారం, నగదును ఏసీబీ (ACB) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె ఇంట్లో వ్యవసాయ భూములు, ప్లాట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు.
నిజామాబాద్ కు చెందిన కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుపడిన ట్రైబర్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు పూర్తయ్యాయి. ఈ సోదాల్లో విస్మయపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఇంట్లో రూ.65,50,000లను అధికారులు గుర్తించారు. అలాగే స్థిరాస్థి పత్రాలు ఉన్నట్టు కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. టిక్కెట్స్ ఇచ్చేందుకు కండక్టర్ సర్కస్ ఫీట్లు.. వీడియో వైరల్
లంచం తీసుకుంటుండగా ఎస్ఈ జగజ్యోతిని ఆమె ఆఫీసులోనే ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ సమయంలో లంచంగా స్వీకరించాలని చూసిన రూ.84 వేలను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం నుంచి ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇవి మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి.
ఈ సోదాల్లో అధికారులు ఆమె ఇంట్లో భారీగా నగదు, డబ్బులు, బంగారంతో పాటు ఆస్తి పత్రాలను గుర్తించారు. నగల రూపంలో ఉన్న బంగారం బరువు 3.639 కిలోలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటి విలువ మార్కెట్ లో రూ.1,51,08,175 గా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.65,50,000 నగదు లభించాయి.
వీటితో పాటు వ్యవసాయ భూములు, ప్లాట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. వీటి విలువ ఇంకా తెలియరాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జగజ్యోతికి ఆస్తులు ఉన్నాయని అధికారులు తెలుసుకున్నారు. ఓ ఎస్ఈ స్థాయి మహిళా అధికారి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో నగదు, బంగారం, ఆస్తి పత్రాలు లభ్యమవడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.