హత్యప్లాన్ కోసం సెలవు.. బాస్‌ని హతమార్చి, మృతదేహాన్ని ఇంటి ప్రాంగణంలో పూడ్చిపెట్టి...
డిఫెన్స్ అధికారిని హత్య చేసి.. ఇంటివెనుక పెరట్లో పాతిపెట్టాడో వ్యక్తి. అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు,

ఢిల్లీ : చిన్నచిన్న విషయాలకే హత్యలు చేస్తున్న ఘటనలు నేటి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీలోని ఆర్‌కే పురంలో ఇలాంటి షాకింగ్ ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి 42 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి తన ఇంటి ప్రాంగణంలో మృతదేహాన్ని పాతిపెట్టాడు. ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత నిందితుడు తన ప్రాంగణంలో సిమెంట్‌తో సమాధి చేశాడని పోలీసులు తెలిపారు.
మృతుడు సర్వే ఆఫ్ ఇండియా డిఫెన్స్ అధికారి. అతను ఆగస్టు 29న కనిపించకుండా పోయాడు. అతనికోసం గాలింపు చేపట్టిన పోలీసులు సెప్టెంబర్ 2న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరణించిన అధికారి మహేష్ కుమార్ గా గుర్తించారు. నిందితుడు అనీస్ మహేష్ దగ్గర క్లర్క్‌గా పనిచేశాడు. అనీస్ ను అరెస్ట్ చేయగానే నేరం అంగీకరించాడు.
దడపుట్టించాడు.. విమానం ల్యాండింగ్ కు ముందు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయి...
తన ప్రియురాలితో లైంగికంగా ప్రవర్తించినందుకే మహేశ్‌కుమార్‌ను హత్య చేసినట్లు అనీస్ తెలిపాడు. అంతేకాదు మహేష్ తన దగ్గర తీసుకున్న రూ. 9 లక్షల అప్పును కూడా తిరిగి చెల్లించడం లేదని పేర్కొన్నాడు. అనీస్ మహేష్ ను హత్య చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. దీనికోసం ఆగస్టు 28న సెలవు తీసుకున్నాడు.
తాను అనుకున్న హత్యాపథకాన్ని అమలు చేయడానికి లజ్‌పత్ నగర్, సౌత్ ఎక్స్‌టెన్షన్‌లోని మార్కెట్‌లలో 6 అడుగుల పాలిథిన్ షీట్, పారను కొనుగోలు చేశాడు. అదే రోజు మధ్యాహ్నం ఆర్ కె పురం సెక్టార్ 2లోని తన నివాసంలో తనను కలవాలని మహేష్ కుమార్‌ను కోరాడు.
అక్కడికి వచ్చిన మహేష్ తలపై పైప్ రెంచ్‌తో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని అనీస్ తెలిపారు. హత్యానంతరం అనీస్ మోటార్‌సైకిల్‌పై సోనిపట్‌లోని స్వగ్రామానికి పారిపోయాడు. తన మొబైల్ ఫోన్ కూడా ఢిల్లీలో వదిలేశాడు. మరుసటి రోజు, ఆగష్టు 29 న, అనీస్ తిరిగి వచ్చి మహేష్ మృతదేహాన్ని రాత్రి తన ఇంటి ప్రాంగణంలో పెద్దగా లోతులేని గొయ్యిలో పూడ్చాడు. ఆ ప్రాంతాన్ని సిమెంటుతో చదును చేశాడు.
ఈ కేసును విచారించిన అధికారులు సెప్టెంబర్ 2న అదృశ్యమైన అధికారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, నిందితులను వెంటనే అరెస్టు చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది.