బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవిని సీబీఐ ప్రశ్నించిన ఒక రోజు తరువాత కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. దీని కోసం ఆయన ఉంటున్న మిసా భారతి నివాసానికి సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం చేరుకున్నారు. 

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని సోమవారం విచారించిన సీబీఐ.. మంగళవారం కూడా తన దూకుడుని కొనసాగిస్తోంది. అదే కేసులో కేంద్ర మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ను సీబీఐ మంగళవారం ప్రశ్నించడం ప్రారంభించింది. రబ్రీ దేవిని పాట్నా నివాసంలో దాదాపు ఐదు గంటలపాటు విచారించిన ఒక రోజు తరువాత ఆర్జేడీ సుప్రీంను ప్రశ్నిస్తోంది.

ఢిల్లీలో దారుణం.. 16 ఏళ్ల బాలికపై స్నేహితుడి కాల్పులు.. ఇద్దరి మధ్య వాగ్వాదమే కారణం..

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు సీబీఐ అధికారుల బృందం లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం నివసిస్తున్న పండారా పార్క్‌లోని మిసా భారతి నివాసానికి మంగళవారం ఉదయం 10.40 గంటలకు రెండు కార్లలో చేరుకుంది. ఆ స్కామ్ కేసులో అతడిని విచారించడం ప్రారంభించింది. 

Scroll to load tweet…

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో నిందితులందరికీ మార్చి 15 న సమన్లు ​​జారీ చేసిందని అధికారులు తెలిపారు. మరో దశ విచారణలో భాగంగా తాజా రౌండ్ విచారణ జరుగుతోందని.. ఇందులో డబ్బు జాడ, పెద్ద కుట్రను నిర్ధారించడానికి దర్యాప్తు సంస్థ ప్రయత్నిస్తోందని వారు చెప్పారు.

మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం.. హాజ‌రైన ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా

దాణా కుంభకోణంలో దోషిగా తేలిన తరువాత అస్వస్థతతో ఉన్న లాలూ ప్రసాద్‌ను, ఆయన భార్యను తాజాగా ప్రశ్నించడంపై సోమవారం ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ... దర్యాప్తు సంస్థలు బీజేపీ రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్నది బహిరంగ రహస్యమని అన్నారు. ఆ పార్టీతో పొత్తుకు అంగీకరించే వారికి అవి సాయం చేస్తాయని ఆరోపించారు.

వ్యాపారవేత్తను హత్య చేసిన ‘గే’ భాగస్వామి.. అక్రమసంబంధం కొనసాగించమని బలవంతం చేసినందుకే....

రబ్రీదేవిని సీబీఐ అరెస్టు చేయడంపై కాంగ్రెస్ కూడా మండిపడింది. కాషాయ పార్టీ ప్రతిపక్షాల గొంతును అణచివేయాలని చూస్తోందని ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘ఈరోజు రబ్రీ దేవి వేధింపులకు గురవుతున్నారు. లాలూ ప్రసాద్, అతడి కుటుంబ సభ్యులు తలవంచకపోవడంతో ఏళ్ల తరబడి వేధింపులకు గురవుతున్నారు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడం, వేధించడం సరికాదని అన్నారు.