సంబంధం కొనసాగించాలని బలవంతం చేసినందుకు వ్యాపారవేత్తను అతని గే భాగస్వామి హత్య చేసిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. సుత్తితో కట్టి, కత్తెరతో పొడిచి అతడిని హతమార్చారు. 

బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరులో ఫిబ్రవరి 28న జరిగిన ఓ వ్యాపారి హత్య కలకలం రేపింది. మైసూరు రోడ్డులోని నాయండహళ్లిలోని పాత భవనంలో అతను హత్యకు గురయ్యాడు. 44 యేళ్ల వ్యాపారవేత్తను అతని స్వలింగ సంపర్క భాగస్వామే కొట్టి హత్య చేశాడని తేలింది. స్వలింగసంపర్కి అయిన అతను తన భాగస్వామి ఈ బంధాన్ని ఆపేద్దాం అంటే అంగీకరించలేదు. తనతో సంబంధాన్ని కొనసాగించాలని బలవంతం చేశాడు. దీంతో అతను హత్య చేసినట్లుగా తేలింది. 

వ్యాపారవేత్త లియాకత్ అలీ ఖాన్‌ను అనుమానిత హంతకుడు ఇలియాజ్ ఖాన్ (26) తలపై సుత్తితో కొట్టి, కత్తెరతో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. లియాకత్ ఫిబ్రవరి 22న రెండో పెళ్లి చేసుకున్నాడు. అతనికి మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరందరితో కలిసి అతను చంద్రా లేఅవుట్‌లో ఉంటున్నాడు. అయితే, ఘటన జరిగిన రోజు లియాఖత్ అర్థరాత్రి గడుస్తున్నా ఇంటికి రాలేదు. దీంతో తండ్రిని వెతుక్కుంటూ వచ్చిన అతని 17యేళ్ల కొడుకుకు ఫిబ్రవరి 28న తెల్లవారుజామున 2 గంటల సమయంలో వ్యాపారవేత్త మృతదేహంగా కనిపించాడు. 

తీహార్ జైలులో సెల్ నెం. 1లో మనీష్ సిసోడియా.. సత్యేంద్ర జైన్‌కు దూరంగా...

అతడిని ఎవరో సుత్తితో కొట్టి, కత్తెరతో పొడిచి చంపినట్లుగా తేలింది. లియాకత్ అలీ ఖాన్‌ ప్రకటన ప్రింటింగ్ ఏజెన్సీని నడుపుతున్నాడు. అతను ఆ రాత్రి చాలాపొద్దుపోయిన తరువాత కూడా ఇంటికి రాకపోవడంతో కొడుకు వెతుకుతూ బయలుదేరాడు. తండ్రి చనిపోయి కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన కొడుకు.. తండ్రి హత్యతో ఇలియాజ్‌తో సహా ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య వెనుక ఆర్థిక వివాదమే కారణమని అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెజె నగర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇలియాజ్‌కు మూడేళ్ల క్రితం జిమ్‌లో లియాకత్‌తో పరిచయం ఏర్పడింది. స్నేహితులుగా మారారు. అలా యేడాది గడిచిన తరువాత వీరిద్దరూ రిలేషన్ లోకి అడుగుపెట్టారు. ఘటన జరిగిన రోజు వీరిద్దరూ లియాకత్ పాత భవనంలో కలిశారని పోలీసులు తెలిపారు. శృంగారం తర్వాత విడిపోయే విషయమై గొడవ పడ్డారు. ఇలియాజ్ తన తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయితో వివాహం చేసుకోవాలనుకున్నాడు.

లియాకత్‌తో తన సంబంధాన్ని ముగించాలనుకున్నాడు. కానీ లియాకత్ దీనికి ఒప్పుకోలేదు. ఇలియాజ్ ను తనతో సంబంధం కొనసాగించాలని బలవంతం చేశాడు. ఇదే విషయమై చాలా రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. 
ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన ఇలియాస్ లియాకత్ ను చంపాడు. 

ఆ తరువాత నిందితుడు ఇలియాజ్ రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్లాడు. కొన్ని నిద్రమాత్రలు వేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం, అతను నొప్పితో బాధపడుతున్నాడని గమనించి తండ్రి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఇలియాజ్ తండ్రి.. తన కొడుకు ఆత్మహత్యాయత్నం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిందితుడు సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడని, కోర్టు ముందు హాజరుపరిచామని, అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని డిసిపి పశ్చిమ లక్ష్మణ్ నింబర్గి తెలిపారు.