ఇద్దరి స్నేహితుల మధ్య మొదలైన గొడవ తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు..తన స్నేహితురాలైన 16 ఏళ్ల బాలికపై కాల్పులు జరిపారు. తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. 

ఈశాన్య ఢిల్లీలో దారుణం జరిగింది. నంద్ నగ్రి జిల్లాలో సోమవారం సాయంత్రం 16 ఏళ్ల బాలికపై ఆమె స్నేహితుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సోమవారం రాత్రి 8:27 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని జీటీబీ ఆసుపత్రికి తరలించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

వ్యాపారవేత్తను హత్య చేసిన ‘గే’ భాగస్వామి.. అక్రమసంబంధం కొనసాగించమని బలవంతం చేసినందుకే....

వివరాలు ఇలా ఉన్నాయి. 16 ఏళ్ల బాలిక 19-20 ఏళ్ల వయస్సున్న కాసిం స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో కాసింకు కోపం వచ్చి తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన సుభాష్ పార్క్ పరిసరాల్లో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని హాస్పిటల్ కు తరలించారు.

ఆటో నడిపిన బిల్ గేట్స్... మహేంద్ర రియాక్షన్ ఇదే..!

నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు అయ్యింది. దర్యాప్తు జరుగుతోంది అని ఢిల్లీ డీసీపీ (ఈశాన్య) జాయ్ టిర్కీ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు.

Scroll to load tweet…

నంద్ నగ్రిలోని సుభాష్ పార్క్ పరిసరాల్లో పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు తగినన్ని పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. ఈ విషయంలో తదుపరి విచారణ కానీ ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.