నిరుడు డిసెంబర్‌లో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. శనివారం ఆయన భారత్ తిరిగి రానున్నారు. 

గతేడాది డిసెంబర్‌లో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ శనివారం భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రికి కిడ్నీ దానం చేసిన లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ట్విట్టర్‌లో భావోద్వేగ పోస్ట్‌ షేర్ చేశారు. ఆర్జేడీ చీఫ్ శనివారం భారతదేశానికి బయలుదేరనున్నారు.

‘‘ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.. ఈ ముఖ్యమైన విషయం మన అధినేత లాలూజీ ఆరోగ్యం గురించి.. నాన్న ఫిబ్రవరి 11న సింగపూర్ నుంచి ఇండియా వెళ్తున్నారు. కూతురిగా నా డ్యూటీ చేస్తున్నాను.. నాన్నకు ఆరోగ్యం చేకూర్చిన తర్వాత ఆయన్ని మీ అందరి మధ్యకు తిరిగి పంపిస్తున్నాను. ఇప్పుడు మీరంతా మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలి’’ అని రోహిణి ఆచార్య ట్వీట్ చేశారు.

లాలూకు కిడ్నీ ఇవ్వనున్న ఆయన కూతురు రోహిణి.. త్వరలోనే సింగపూర్‌లో ఆపరేషన్..!

నిరుడు డిసెంబర్‌లో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో లాలూ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆ శస్త్రచికిత్స తర్వాత, లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు: "మా నాన్నకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆయనను ఆపరేషన్ థియేటర్ నుండి ICUకి మార్చారు. కిడ్నీదానం చేసిన అక్క రోహిణి ఆచార్య, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు.

ఆర్జేడీ అధినేత శస్త్రచికిత్స తర్వాత తేజస్వి యాదవ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆయన ఆరోగ్యం, కోలుకోవడంపై ఆరా తీశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేశారు. నిరుడు నవంబర్‌లో, తేజస్వి యాదవ్ తన తండ్రికి తన సోదరి రోహిణి కిడ్నీ సరిపోయిందని.. కుటుంబ సభ్యుల నిర్ణయంతో ఆమె తన కిడ్నీని ఇవ్వబోతున్నారని తెలిపారు. 

"కుటుంబం నుండి ఎవరైనా నా తండ్రికి కిడ్నీ దానం చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో పరీక్షలు చేయగా.. నా సోదరి రోహిణి కిడ్నీ బాగా సరిపోయింది" అని తేజస్వి పాట్నాలో విలేకరులతో తెలిపారు. 74 ఏళ్ల లాలూ కొంతకాలంగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతుండగా, ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు.

దాతగా ఉండేందుకు ఆయన కుమార్తె రోహిణి ముందుకు వచ్చింది. ఆమె పట్టుబట్టడంతో, శస్త్రచికిత్స కోసం సింగపూర్‌ కు వెళ్లారు. రోహిణి ఆచార్య వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రావు సమేష్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. సింగపూర్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.