Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri: ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. విచారణకు రావాల్సిందిగా ఆశీష్ మిశ్రాకు సమన్లు, ఐజీ ప్రకటన

లఖీంపూర్ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు ఐజీ (IG Lucknow) ప్రకటించారు. ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. 

Lakhimpur Kheri Police on the lookout for Ashish Misra arrest soon says IG Lucknow
Author
Lucknow, First Published Oct 7, 2021, 5:30 PM IST

లఖీంపూర్ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు ఐజీ (IG Lucknow) ప్రకటించారు. ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. 

అంతకుముందు లఖింపూర్ ఖేరి ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని supreme court ఆదేశించింది. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన వారి వివరాలు, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదైతే దాని వివరాలు, అరెస్టులు, దర్యాప్తు కమిటీ వివరాలూ అందించాలని తెలిపింది.

ALso Read:Lakhimpur Kheri: విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీం.. ‘డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించండి’

ఈ నివేదికలు సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన కౌన్సెల్‌ను ఆదేశించింది. ఈ ఘటనలో మరణించిన రైతు లవ్‌ప్రీత్ సింగ్ తల్లికి అవసరమైన వైద్య సహకారం అందించాలని సుప్రీంకోర్టు సూచించింది. తన తనయుడు మరణించాడన్న వార్త వినగానే ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తునకు హైకోర్టు మాజీ న్యాయమూర్తితో ఏకసభ్య కమిటీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కౌన్సెల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

కాగా, నరేంద్ర మోడీ (narendra modi) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను (farm Laws) రద్దు చేయాలని కోరుతూ ఆదివారం యూపీలోని లఖింపుర్‌ ఖేరిలో రైతులు టికోనియా-బన్బీపుర్‌ రహదారిపై రైతులు ఆందోళన చేస్తుండగా.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్ర (ajay mishra) తనయుడు ఆశిష్‌ మిశ్రా (ashish misra) కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించారు. తమ సహచరుల మరణంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వెనుక వస్తున్న కారును ధ్వంసం చేసి అందులో ప్రయాణిస్తున్న నలుగురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి తనయుడు సహా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో యూపీ ప్రభుత్వం (up govt) దర్యాప్తు నిమిత్తం సిట్‌ను (sit) ఏర్పాటు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios