Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri: విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీం.. ‘డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించండి’

దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేసింది. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

supreme court to hear lakhimpur kheri case again on friday
Author
New Delhi, First Published Oct 7, 2021, 2:15 PM IST

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని lakhimpur kheriలో కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతులపైకి దూసుకెళ్లిన ఘటన సంచలనమైంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు.

ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని supreme court ఆదేశించింది. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన వారి వివరాలు, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదైతే దాని వివరాలు, అరెస్టులు, దర్యాప్తు కమిటీ వివరాలూ అందించాలని తెలిపింది. ఈ నివేదికలు సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన కౌన్సెల్‌ను ఆదేశించింది.

ఈ ఘటనలో మరణించిన రైతు లవ్‌ప్రీత్ సింగ్ తల్లికి అవసరమైన వైద్య సహకారం అందించాలని సుప్రీంకోర్టు సూచించింది. తన తనయుడు మరణించాడన్న వార్త వినగానే ఆమె అనారోగ్యం పాలయ్యారు.

ఈ ఘటనపై దర్యాప్తునకు హైకోర్టు మాజీ న్యాయమూర్తితో ఏకసభ్య కమిటీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కౌన్సెల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios