Asianet News TeluguAsianet News Telugu

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫైనల్ కీ విడుదల.. ఎనిమిది ప్రశ్నలను తొలగించిన టీఎస్‌పీఎస్సీ..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫైన్ కు ను మంగళవారం రాత్రి విడుదల చేసింది. దీనిని తన అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. జూన్ 28న విడుదల చేసిన ప్రైమరీ కీ తో పోల్చితే.. తాజాగా విడుదలైన కీలో పలు మార్పులు చేసింది. 

Group -1 prelims final key released.. TSPSC removed eight questions..ISR
Author
First Published Aug 2, 2023, 7:46 AM IST

అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎదురు చూస్తున్న గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల అయ్యింది. దీనిని టీఎస్‌పీఎస్సీ తన అధికారిక వెబ్ సైట్ లో మంగళవారం రాత్రి విడుదల చేసింది. కాగా గ్రూప్ -1 పరీక్ష ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఎనిమిది ప్రశ్నలను తొలగించింది. అలాగే ప్రైమరీ కీలో పేర్కొన్న రెండు ప్రశ్నలకు సమాధానాలు తాజా కీ లో మార్చింది. 

అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రత నమోదు

మొదటి కీ లో మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రకారం 38వ ప్రశ్నకు 3 సమాధానం అని పేర్కొనగా.. తాజా కీ లో 2గా పేర్కొంది. దీంతో పాటు 59 ప్రశ్నకు ప్రైమెరీ కీలో 1 సమాధానం ఉండగా.. ఇప్పుడు 3కు మార్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 11వ తేదీన ఈ పరీక్షను నిర్వహించారు. దీనికి 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. 

అల్లరిమూక ఆగడాలకు విద్యార్థిని బలి.. వేధిస్తూ, బలవంతంగా శానిటైజర్ తాగించి, అడ్డొచ్చిన సోదరుడిపై కూడా..

ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీ ని జూన్‌ 28వ తేదీన టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. జులై 1వ తేదీ నుంచి 5 వరకు అభ్యంతరాలు పంపించాలని సూచించింది. ప్రైమరీ కీ పై వచ్చిన అభ్యంతరాలను నిపుణల కమిటీ పరిశీలించింది. ఆ కమిటీ పరిశీలించి, సరి చేసిన అంశాలను కమిషన్ ఆమోదించి, ఫైనల్ కీ విడుదల చేసింది. ఇక ఈ ఫైనల్ కీలో ఇక ఎలాంటి సవరణలు ఉండవని ప్రకటించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios