Aryan Khan Case : ప్రత్యక్ష సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్...
Lookout noticeజారీ అయిన కిరణ్ గోసావి, మహారాష్ట్రలో తనకు "బెదిరింపులు" ఎదురవుతున్నాయని.. అందుకే తాను ఉత్తరప్రదేశ్ పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే Kiran Gosavi తమకు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదనలను లక్నో పోలీసులు తోసిపుచ్చారు.
న్యూఢిల్లీ : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ముంబై డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ ఏజెన్సీకి చెందిన వివాదాస్పద "independent witness" ను.. లుకౌట్ నోటీసులు జారీ అయిన మూడు రోజుల తర్వాత పూణేలో అదుపులోకి తీసుకున్నారు.
అంతకు ముందు అతను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతానని పేర్కొన్నాడు. Lookout noticeజారీ అయిన కిరణ్ గోసావి, మహారాష్ట్రలో తనకు "బెదిరింపులు" ఎదురవుతున్నాయని.. అందుకే తాను ఉత్తరప్రదేశ్ పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే Kiran Gosavi తమకు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదనలను లక్నో పోలీసులు తోసిపుచ్చారు.
ప్రైవేట్ investigator, అయిన గోసావి ఈ నెల ప్రారంభంలో క్రూయిజ్ షిప్ రైడ్ సమయంలో, తరువాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లేదా NCB కార్యాలయంలో ఆర్యన్ ఖాన్‌తో కలిసి ఉన్నారు. రెండు ప్రదేశాలలో ఆర్యన్ ఖాన్‌తో అతని సెల్ఫీలు, వీడియోలు.. షారుఖ్ ఖాన్ కుమారుడికి గోసావికి చాలా పరిచయం ఉందనే విషయాన్ని సూచిస్తోంది.
ఈ విషయం మీద మహారాష్ట్ర పాలక కూటమి యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ దర్యాప్తుపై ప్రశ్నల వర్షం కురిపించింది. anti-drugs agency చేపట్టిన దాడిలో, కార్యాలయంలో ఏజెన్సీకి చెందిన "స్వతంత్ర సాక్షి" ఎందుకు హాజరు కావాలి? ఉన్నత స్థాయి నిందితులతో సెల్ఫీలు ఎందుకు తీసుకోవాలని? పలువురు నాయకులు ప్రశ్నించారు.
గత ఆదివారం, కిరణ్ గోసావి personal bodyguardగా చెప్పుకునే వ్యక్తి అతనిపై లంచం ఆరోపణలు చేశాడు. ఈ కేసులో మరో సాక్షి అయిన ప్రభాకర్ సెయిల్ మాట్లాడుతూ, సామ్ డిసౌజాతో చెల్లింపుల గురించి గోసావి టెలిఫోనిక్ సంభాషణను తాను విన్నానని చెప్పాడు.
వారు "బాంబు రూ. 25 కోట్లు" అడగాలని, ఆ తరువాత రూ.18 కోట్లతో సెటిల్ చేయాలని గోసావి చెప్పినట్లు తాను విన్నానని, ఇందులో రూ.8 కోట్లు ఎన్‌సిబికి చెందిన జోనల్ అధికారి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న Sameer Wankhedeకి అని సెయిల్ పేర్కొన్నాడు.
దీని గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని గోసావి మీడియాకి చెప్పారు. అక్టోబర్ 2కి ముందు తాను వాంఖడేని కలవలేదని, "నేను దీన్ని మొదటిసారిగా వింటున్నాను" అని చెప్పాడు.
ఔను.. సమీర్ వాంఖడే బ్లాంక్ పేపర్స్‌పై నా సంతకాలూ తీసుకున్నాడు.. మరో సాక్షి ఆరోపణలు
వాంఖడే సోమవారం ఢిల్లీకి వచ్చారు. తనకు ఏ ఏజెన్సీ నుంచి సమన్లు అందలేదని ఆయన కొట్టిపారేశారు. payback allegationsపై, మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నాయకుడు నవాబ్ మాలిక్ వాంఖడేపై మాటల యుద్ధం కొనసాగించిన విషయం తెలిసిందే.
క్రూయిజ్ షిప్ నుండి డ్రగ్స్ రికవరీకి సంబంధించిన కేసు "నకిలీ" అని Nawab Malik ఆరోపించాడు. ముంబైలో బిజెపి, NCB "ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నాయని" ఆరోపించాడు. నవాబ్ మాలిక్, సమీర్ వాంఖడే పుట్టుకకు సంబంధించిన డాక్యుమెంట్ ఫోటోను ట్వీట్ చేసి, "ఫోర్జరీ ఇక్కడ నుండి ప్రారంభమైంది" అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ బుధవారం మరోసారి వాయిదా పడింది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, మున్‌మున్ దమేచాల బెయిల్ దరఖాస్తులపై వాదనలు విన్న బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారణను గురువారం మధ్యాహ్నం 2.30కు వాయిదా వేసింది.
ఎన్‌డీపీఎస్ స్పెషల్ కోర్టు, సెషన్స్ కోర్టులు ఇప్పటికే ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీపావళి సెలవుల కారణంగా ఎల్లుండి లోగా ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించకుంటే వచ్చే నెల 15వ తేదీ వరకు జైలులో ఉండాల్సి ఉంటుంది.