ఆమెకు అనారోగ్యం చేసింది. ఎలాగైనా బతికించుకోవాలని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయినా లాభం లేదు. చికిత్స పొందుతూనే ఆమె చనిపోయింది. ఆమె మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ ఇవ్వాలని బంధువులు కోరారు. అందుకు హాస్పిటల్ నిరాకరించడంతో...  వెంటనే.. ఆమె శవాన్ని మంచంపై పడుకోబెట్టి.. బుజాలపై దాదాపు ఐదుకిలోమీటర్లు మోస్తూ... తమ ఇంటికి తీసుకువెళ్లారు . ఈ దారుణ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

లేడీ ఫ్రెండ్ కు పిస్టల్ చూపిస్తూ తనను తానే కాల్చుకున్నాడు

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లా లోని బరాపల్లి గ్రామానికి చెందిన కునీ నాయక్ కి విపరీతమైన జ్వరం వచ్చింది. వెంటనే జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆమె  చనిపోయింది. దీంతో ఆమె బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. హాస్పిటల్ నుంచి వాళ్ల గ్రామానికి వెళ్లడానికి కనీసం ఐదు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది.

దీంతో... ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి హాస్పిటల్ యాజమాన్యాన్ని అంబులెన్స్ కావాలని కోరారు. అయితే అందుకు హాస్పిటల్ సిబ్బంది నిరాకరించారు.దీంతో చేసేది లేక ఆమె ను మంచెం మీద పడుకోబెట్టి... ఐదు కిలోమీటర్లు భుజాలపై మోస్తూ... స్వగ్రామానికి తీసుకువెళ్లారు. 

చెల్లెలిపై అఘాయిత్యం.... నిందితుడిని కసితీరా చంపిన అన్న

అయితే...దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో... వివాదమైంది. అయితే... హాస్పిటల్ యాజమాన్యం మాత్రంయ ఈ ఘటనపై ఇప్పటి వరకు స్పందించలేదు.