KIMS: ప్రముఖ హాస్పిటల్ చైయిన్ కిమ్స్ మరో అద్భుతాన్ని సాకారం చేసింది. 450 పడకలతో కూడిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS Hospitals) తన మొదటి మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌ను కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభించింది. బెంగళూరులో ఏర్పాటైన ఈ ఆధునిక ఆసుపత్రి మొత్తం 450 పడకలతో ప్రారంభమైంది.
ఈ ఆసుపత్రిలో 35కిపైగా మెడికల్, సర్జికల్ విభాగాలు, 120కు పైగా అడ్వాన్స్‌డ్ ఐసీయూ పడకలు, 100కుపైగా ప్రత్యేక అవుట్‌పేషంట్ (OPD) గదులు ఉన్నాయి. అత్యవసర, సాధారణ వైద్య అవసరాలన్నింటినీ తీర్చే సదుపాయాలను ఇక్కడ కల్పించారు.
ఈ విషయమై కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ.. "బెంగళూరులో మా మొదటి ఆసుపత్రి ప్రారంభం మా దృష్టిని మరింత బలపరుస్తుంది. అందరికీ సరసమైన ధరలో మంచి వైద్యం అందించడమే మా లక్ష్యం. త్వరలోనే ఎలక్ట్రానిక్ సిటీలో మా రెండో యూనిట్‌ను కూడా ప్రారంభించబోతున్నాం" అని ఆయన తెలిపారు.
ఇక కిమ్స్ హాస్పిటల్స్ విషయానికొస్తే.. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ హెల్త్‌కేర్ సంస్థల్లో ఇదీ ఒకటి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఇప్పటికే ఆసుపత్రులను నిర్వహిస్తోంది. త్వరలో కర్ణాటకలో కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం కిమ్స్ గ్రూప్ మొత్తం 25 హాస్పిటల్స్‌తో, 8,300కుపైగా పడకలతో పనిచేస్తోంది.
బ్రాంచ్‌ల వివరాలు:
తెలంగాణ: సికింద్రాబాద్, కొండాపూర్, గచ్చిబౌలి, బేగంపేట
ఆంధ్రప్రదేశ్: నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఒంగోలు, విశాఖ (2 యూనిట్లు), అనంతపురం, గుంటూరు (2 యూనిట్లు), కర్నూలు
మహారాష్ట్ర: నాగ్‌పూర్, నాసిక్, థానే, సంగ్లీ
కేరళ: కన్నూర్, కొల్లం
కర్ణాటక: బెంగళూరు
కిమ్స్ ఆసుపత్రులు గుండె వైద్యం, క్యాన్సర్, న్యూరో సైన్సెస్, జీర్ణ సంబంధ వ్యాధులు, ఆర్థోపెడిక్స్, అవయవ మార్పిడి, కిడ్నీ సంబంధ చికిత్సలు, మదర్ & చైల్డ్ కేర్ సహా 25 స్పెషాలిటీలలో వైద్య సేవలు అందిస్తున్నాయి.
