ఎనిమిదేళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం.. యువకుడి అరెస్ట్...
ఓ ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించిన యువకుడు.. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కేరళ : మహిళలు, బాలికలు, యువతులపై అత్యాచారాలకు అంతులేకుండా పోతోంది. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా దారుణాలకు తెగిస్తున్నారు కామాంధులు. అలాంటి ఓ దారుణ ఘటన కేరళలో వెలుగు చూసింది. కేరళలోని ఎర్నాకులం జిల్లా అలువాలో ఓ 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆమెను కిడ్నాప్ చేసిన యువకుడు ఆ తర్వాత అత్యాచారానికి ఒడిగెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…
బాలిక కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చి కేరళలో వలస కార్మికులుగా నివసిస్తున్నారు. కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాలిక ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. ఆ సమయంలో అక్కడే కాపు కాసిన యువకుడు ఆమెను అపహరించాడు.
'నిన్ను చంపేస్తా'.. డాక్టర్‌పై పేషెంట్ స్క్రూడ్రైవర్‌తో దాడి
సమీపంలోని వరి పొలంలోకి లాక్కెళ్లాడు. ఆ సమయంలో బయటికి వచ్చిన స్థానికులు ఒకరు ఇది గమనించారు. దీంతో వెంటనే మిగతా వారిని అప్రమత్తం చేశాడు. అందరూ కలిసి చిన్నారిని వెతకడం ప్రారంభించారు. కాసేపటి తర్వాత చిన్నారి వరి పొలం నుంచి బయటికి వస్తుండగా గుర్తించారు. చిన్నారి మర్మాంగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించగా సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని మీద ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిందితుడిని పట్టుకోవడం కోసం ఒత్తిడి పెరిగింది.
దీంతో పెద్ద ఎత్తున గాలింపు చేపట్టిన పోలీసులు గురువారం నాడు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు ఓ వంతెన కింద మద్యం తాగుతూ కనిపించాడు. అతని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నిందితుడిని క్రిస్టల్ రాజ్ (27)గా గుర్తించారు.