'నిన్ను చంపేస్తా'.. డాక్టర్‌పై పేషెంట్ స్క్రూడ్రైవర్‌తో దాడి
ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఒక రోగి వైద్యుడిపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ప్రభుత్వ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని వైద్యుడిపై రోగి దాడికి పాల్పడ్డాడు. డాక్టర్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో వైద్యుడు ప్రాణాలతో బయట పడినప్పటికీ.. అతనికి పలు చోట్ల గాయాలయ్యాయి. నిందితుడైన రోగిని అరెస్టు చేశారు. అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
వివరాల్లోకెళ్లే.. డాక్టర్ రాహుల్ కనేలా సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేస్తున్నారు. సెప్టెంబరు 4న ఆయన అత్యవసర విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఒక రోగి తన వద్దకు వచ్చి.. తన చేతికి ఉన్న కాన్యులాను తీసేయమని కోరాడని డాక్టర్ రాహుల్ పోలీసులకు చెప్పాడు. అది నా పనికాదనీ, నర్స్ సహాయం కోరమని తనకు సలహా ఇచ్చానని తెలిపారు.
ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ రోగి తనపై దుర్భాషలాడాడనీ, శారీరకంగా దాడి చేశాడని డాక్టర్ కలేనా ఆరోపించారు. పేషెంట్ తన జేబులో ఉన్న స్క్రూడ్రైవర్ తీసి మెడపై, పొత్తికడుపుపై పొడిచాడనీ, దీంతో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనలో తన రెండు కుడి చేతులకు కూడా గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సిబ్బంది వెంటనే తనకు చికిత్స చేయడం ప్రారంభించారని తెలిపారు. ఈ మొత్తం విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు బాధిత డాక్టర్. నిందితుడైన పేషెంట్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి పాయింటెడ్ స్క్రూడ్రైవర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ రాహుల్ పై దాడి చేసిన రోగిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించారు.