మధ్యప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితులు పూటకో మలుపు తిరుగుతూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. మొన్న ఒక పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ లోని ఒక హోటల్ లో బస చేసి ఉన్నప్పుడు వారిని తిరిగి డిగ్గీ రాజా విజయవంతంగా వెనక్కి తీసుకువచ్చారు. 

అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరువాత జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా తిరుగుబాటు చేసి పార్టీకి రాజీనామా చేయడం, ఆయన వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులతో సహా 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఒక ప్రైవేట్ రిసార్టుకి వెళ్లిపోయారు. 

ఇక ఆతరువాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసినవే! జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షాతో కలిసి ప్రధాని మోడీని కలవడం, ఆతరువాత పార్టీకి రాజీనామా చేయడం అన్ని చక చకా జరిగిపోయాయి. 

Also read: బీజేపీ గూటికి సింధియా.. చల్లగా ఉండు మహరాజా అంటూ దిగ్విజయ్ ట్వీట్

ఈ పరిస్థితుల నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అందరూ కూడా తమ తమ పార్టీలకు చెందిన నేతలను వేరే చోటికి తరలిస్తున్నాయి. బీజేపీ శ్రేణులు తమ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ కి కాంగ్రెస్ శ్రేణులు తమ ఎమ్మెల్యేలను జైపూర్ కి తరలిస్తున్నాయి. 

ఇందాక ఒక గంట కింద కాంగ్రెస్ కి చెందిన ఎమ్మెల్యేలను భోపాల్ విమానాశ్రయానికి బస్సులో తరలిస్తున్న ఒక చిత్రం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఒక చిన్న పిల్లడు కూడా ఉన్నాడు. చిన్న పిల్లాడ్ని ఫొటోలో చూడగానే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నెటిజన్లు వెంటనే కుర్రాడి ఫోటోను చూపిస్తూ... ఈ చిన్న పిల్లడు ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే అంటూ ఫన్నీగా ప్రశ్నించారు. 

ఒక్కరు మొదలుపెట్టగానే అందరూ కూడా వెంటనే తమ తమ సృజనాత్మకతకు తోచిన రీతిలో నవ్వులు పూయిస్తున్నారు.