Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ గూటికి సింధియా.. చల్లగా ఉండు మహరాజా అంటూ దిగ్విజయ్ ట్వీట్

జ్యోతిరాదిత్యను పార్టీ ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. 

Was Congress bypassing Jyotiraditya Scindia? Digvijay Singh gave this new information by tweeting
Author
Hyderabad, First Published Mar 11, 2020, 9:32 AM IST

మహారాష్ట్ర  రాజకీయాలు ఒక్క రోజులో తలకిందులయ్యాయి. అధికారం చేపట్టిన 8 నెలలకే కాంగ్రెస్ పీఠం కదిలింది. ఆ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా .. కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. ప్రధాని మోదీని కలిసిన కొద్ది గంటలకే ఆయన తన రాజీనామాను అందజేశారు. కాగా.. ఆయన వెంట దాదాపు 17మంది ఎమ్మెల్యేలు ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీకి తిప్పలు మొదలయ్యాయి. పీఠం కదిలే పరిస్థితి ఏర్పడుతోంది.

 ఈ నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియా పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సెటైర్లు వేశాడు.కాంగ్రెస్‌ పార్టీ దూరం పెట్టినందునే జ్యోతిరాదిత్య సింధియా బీజేపీకి దగ్గరయ్యారనే వాదనను ఆ పార్టీ తోసిపుచ్చింది. జ్యోతిరాదిత్యను పార్టీ ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. 

Also Read తండ్రి పుట్టినరోజు, నానమ్మ కోరిక తీర్చాడు: సింధియాపై వసుంధరా రాజే ప్రశంసలు...

గ్వాలియర్‌ ప్రాంతంలో ఏ కాంగ్రెస్‌ నేతను అడిగినా అక్కడ గడిచిన 16 నెలల్లో సింథియా అనుమతి లేకుండా ఏ పనీ జరగదని చెబుతారని అన్నారు. మన బ్యాంకులు కుప్పకూలుతూ, మన రూపాయి దిగజారుతూ, ఆర్థిక​ వ్యవస్థలో ప్రకంపనలు రేగుతూ, సామాజిక సామరస్యం దెబ్బతింటున్న వేళ ఆయన (జ్యోతిరాదిత్య) మోదీ, షాల నేతృత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని భావిస్తున్నారని డిగ్గీరాజా వ్యంగ్యోక్తులు విసిరారు.

అనంతరం జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశిస్తూ.. ట్విట్టర్ వేదికగా కూడా సెటైర్లు వేశారు. మోదీ, షాల ప్రాపకంలో​ చల్లగా ఉండు మహరాజ్‌ అంటూ జ్యోతిరాదిత్యను ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు. మరోవైపు జ్యోతిరాదిత్యకు మద్దతుగా  ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తే మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. 

జ్యోతిరాదిత్య తోడ్పాటుతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు బెంగళూర్‌లో బస చేసిన రెబెల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios