Asianet News TeluguAsianet News Telugu

కేజీఎఫ్ చాప్టర్ 1 నటుడు కృష్ణ జి రావు కన్నుమూత

కేజీఎఫ్ చాప్టర్ 1లో అంధ వృద్ధుడి పాత్రలో నటించిన కృష్ణ జి రావు కన్నుమూశారు. ఆ సినిమాలో ఆయన పాత్ర చిన్నదే అయినా బాగా పాపులారిటీ తీసుకొచ్చింది. కొంత కాలంగా శ్వాస సంబంధిత బాధపడుతున్న ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. 

KGF Chapter 1 actor Krishna G Rao passes away
Author
First Published Dec 8, 2022, 4:52 PM IST

కేజీఎఫ్ చాప్టర్ 1 ఫేమ్ ప్రముఖ కన్నడ నటుడు కృష్ణ జి రావు కన్నుమూశారు. చాలా కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం కారణంగా ఆయన బాధపడుతున్నాడు. అయితే ఆయన ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించి తన 70వ యేట మరిణించాడు.

ఆసియానెట్ న్యూస్ సర్వే అంచనాలు నిజమయ్యాయి.. వరుసగా ఏడోసారి చారిత్రాత్మకంగా విజయమందుకున్న బీజేపీ ..

కృష్ణ జి రావు మృతి పట్ల కేజీఎఫ్ నిర్మాతలు సంతాపం తెలిపారు. ఈ మేరకు కేజీఎఫ్ చాప్టర్ 1 ప్రొడక్షన్ హౌస్, హోంబలే ఫిల్మ్స్ ఆ సినిమాలోని ఆయన స్టిల్ ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. “కేజీఎఫ్ అభిమానులతో ముద్దుగా పిలుచుకునే కృష్ణ జి రావు మరణించినందుకు హోంబలే చిత్ర బృందం సంతాపం తెలుపుతోంది. ఓం శాంతి.” అని ట్వీట్ చేశారు.

గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం.. కేజ్రీవాల్ ‘భవిష్యవాణి’ప్రసంగాన్ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు 

అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. కృష్ణా జి రావు బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతోందని చెప్పారు. దీంతో వెంటనే ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనను ఐసీయూలో చేర్చారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. అయినా ఆయన చికిత్స కు స్పందించలేదు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. 

కృష్ణ జి రావు అనేక కన్నడ చిత్రాలలో చిన్న పాత్రల్లో నటించారు. ఆయన స్వతహాగా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన కేజీఎఫ్ 1లో ఓ చిన్న పాత్రలో నటించినా గొప్ప కీర్తిని పొందాడు. దీంతో 2023లో విడుదల కాబోతున్న కన్నడ చిత్రం నానో నారాయణప్పలో టైటిల్ పాత్రను పోషించే అవకాశం దక్కింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.
కాగా.. ఆయన కేజీఎఫ్ 1లో అంధుడైన వృద్ధుడి పాత్రను పోషించారు. ఓ సన్నివేశంలో హీరో యష్ ఈ వృద్ధుడిని కాపాడుతాడు. అక్కడి నుంచే కథ మలుపుతిరుగుతుంది. కేజీఎఫ్ 1 తర్వాత పాపులారిటీ బాగా పెరగడంతో అప్పటి నుంచి వరుసగా 30 పాత్రాల్లో ఆయన నటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios