Asianet News TeluguAsianet News Telugu

ఆసియానెట్ న్యూస్ సర్వే అంచనాలు నిజమయ్యాయి..  వరుసగా ఏడోసారి చారిత్రాత్మకంగా విజయమందుకున్న బీజేపీ ..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ముందుస్తు సర్వే (asianet news cfore survey)నిర్వహించింది. బీజేపీ ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి.. మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. నేడు  ఆ అంచనాలు  నిజమయ్యాయి. నేటీ ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.  182 స్థానాలున్న అసెంబ్లీ లో బీజేపీ ఏకంగా 157 సీట్లను కైవసం చేసుకుంది. గతంలోని రికార్టులను బ్రేక్ చేసింది.

Gujarat Mandate 2022: Asianet News prediction comes true; BJP marches to historic 7th consecutive term
Author
First Published Dec 8, 2022, 4:21 PM IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ (asianet news cfore survey) ఆ రాష్ట్రంలో ముందుస్తు సర్వే నిర్వహించింది. ఈ ఎన్నికల్లో  బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి.. మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందని సర్వే అంచనా వేసింది. నేడు వెలువడిన ఫలితాలతో  సర్వే అంచనాలు  నిజమయ్యాయి. నేటీ ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.

182 స్థానాలున్న అసెంబ్లీ లో బీజేపీ ఏకంగా 157 సీట్లను కైవసం చేసుకుంది. గతంలో రికార్టులన్నిటిని బ్రేక్ చేసింది. 1995 నుండి ఎన్నికల్లో ఓడిపోని రాష్ట్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ వరుసగా 7వ సారి అధికారంలోకి రానుంది. ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్, AAP ఘోర పరాజయాన్ని మూఠగట్టుకున్నాయి. ఆయా పార్టీలు వరుసగా కేవలం 16, 5 స్థానాలను గెలుచుకున్నాయి. బీజేపీకి దాదాపు 53 శాతం ఓట్లను కైవసం చేసుకున్నాయి. 

అక్టోబరులో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ సర్వే నిర్వహించింది. ఈ ప్రీ-పోల్ సర్వేలో 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,82,557 మంది ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించింది. పలు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించింది. అందుకే నేటి  ఫలితాలతో సర్వే అంచనాలు దాదాపు మ్యాచ్ అయ్యాయి.  

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ అండ్ టీం సర్వే చేసి బీజేపీ 133-143 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. అదే తరుణంలో కాంగ్రెస్ 28-37 సీట్లు సాధిస్తాయని, ఆప్ 5-14 సీట్లు సాధిస్తాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్‌, గుజరాత్‌లో భూపేంద్ర పటేల్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు బాగున్నాయని,  అందుకే బీజేపీ వైపునకు గుజరాత్ ప్రజలు మొగ్గుచూపుతున్నారని ఏషియానెట్ న్యూస్-కోఫోర్ ప్రీ పోల్ సర్వేలో వెల్లడించింది.  బీజేపీ దాదాపు 48 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

మోడీ పరిపాలనలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మందగమన ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం వంటి కొన్ని సమస్యలు గుజరాత్ ఎన్నికలపై స్వల్ప ప్రభావాన్నే చూపిస్తాయని వెల్లడించింది. దశాబ్దాలుగా పార్టీకి కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో, 2001 నుంచి 2014 వరకు మోదీ ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్‌లో బీజేపీ స్థానంపై ఎలాంటి ప్రభావం లేదని వెల్లడించింది.

అక్టోబర్‌లో జరిగిన ప్రీ-పోల్ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో భాజపా పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నందున ప్రజలు  బీజేపీకే ఓటు వేశారు. అలాగే.. 2017 ఎన్నికలలో జోరుగా ప్రచారం చేసిన రాహుల్ గాంధీ ఘోర వైఫల్యం చెందారు. దీంతో ఈ సారి ఆయన గుజరాత్ రాష్ట్ర ఎన్నికలకు చాలా దూరం ఉన్నాడు. ప్రధానంగా తాను నాయకత్వం వహిస్తున్న  భారత్ జోడో యాత్రపై దృష్టి పెట్టాడు. దీంతో స్థానిక నాయకులే ప్రచారాన్ని ఎక్కువగా నిర్వహించారు. ఓట్ల కోసం ఇంటింటికీ ప్రచారం చేయడంపైనే ఆధారపడ్డారు. 

ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఊహించినట్లుగానే ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ప్రజలను అంతగా ప్రభావితం చేయలేదు. అక్కడి ప్రజల మెప్పు పొందడానికి అనేక ఉచిత వాగ్దానాలిచ్చినా.. గుజరాతీ ఓట్లర్లను ఆకర్షించడంలో ఆప్ విఫలమయ్యింది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఆప్, గుజరాత్‌లో తన సంక్షేమ రాజకీయాలను ప్రజలు అంగీకరిస్తారని ఆప్ కు అర్థమైంది . ఈ ఎన్నికల్లో కేవలం 13 శాతం ఓట్లను సాధించి.. 5 స్థానాలకే పరిమితమైంది. ఏది ఏమైనప్పటికీ ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీకి ప్రధాన పోటీదారుడుగా నిలుస్తాడో? లేదో వేచి చూడాలి. 

పైన పేర్కొన్న అంచనాలు ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ సర్వే పోలింగ్-బౌండ్ రాష్ట్రంలోని ఓటర్ల మానసిక స్థితిని ఎలా ఖచ్చితంగా సంగ్రహిస్తుందో ప్రతిబింబిస్తుంది. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ అంచనా గతంలో కూడా నిజమైంది. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని మేము అంచనా వేసింది. అలాగే.. ఈ గుజరాత్ ఎన్నికల్లో కూడా ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్ అంచనాలు నిజమయ్యాయి. దీంతో మరోసారి ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎగ్జిట్ పోల్స్ మాస్టర్ గా నిలిచిందనడటంలో ఏ మాత్రం సందేహం లేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios