సింగర్ సిద్దూ మూస్ వాలే హత్య కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తుల ఫొటోలు ఓ పెట్రోల్ బంక్ సీసీ కెమెరా ఫుటేజ్ లో పోలీసులకు లభించాయి. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం అయినట్టు తెలుస్తోంది. ఓ పెట్రోల్ బంక్ లో ఇద్దరు అనుమానితులకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఫతేహాబాద్ ప్రాంతంలో ఈ పెట్రోల్ బంక్ ఉంది.
ఈ ఫుటేజీలో కనిపించిన కారు సిద్ధూ మూస్ వాలా హత్యకు ఉపయోగించిన కారు అని పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో కారు నడుపుతున్న వ్యక్తి జాంటీ అనే గ్యాంగ్ స్టర్ గా, మరో నిందితుడిని పర్వత్ ఫౌజీగా గుర్తించారు. ఇద్దరు అనుమానితులు ఆ కారులో ఫ్యూయల్ నింపేందుకు ఆ కారు నుంచి దిగారు. ఆ సమయంలో వారి ఫేస్ లు కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
వీడియో వైరల్.. గాల్లో పల్టీలు కొడుతూ ట్రాన్స్ ఫార్మర్ కంచెలోకి దూసుకెళ్లిన బైక్..
జాంటీ, ఫౌజీ ఇద్దరూ సోనిపట్ కు చెందిన. గ్యాంగ్ స్టర్లు కావడంతో హర్యానాలోని గ్యాంగ్ స్టర్ నెక్సస్, సిద్ధూ మూస్ వాలా హత్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ఫుటేజ్ లో కనిపించిన వారి జాడ కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో పట్టుబడిన నసీబ్ ఖాన్ ఈ గ్యాంగ్ స్టర్లను అదే బొలెరోలోని మాన్సా జిల్లాకు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మే 29వ తేదీన (ఆదివారం) పంజాబ్ లోని మాన్సా జిల్లాని జవహర్కే గ్రామంలో సిద్ధూ మూస్ వాలాను కాల్చి చంపారు. అయితే మూస్ వాలా హత్యకు కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ బాధ్యత వహించాడు. లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సన్నిహిత సంబంధాలున్న బ్రార్.. గ్యాంగ్ స్టర్ విక్కీ మిద్దుఖేరా మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మూస్ వాలాను చంపినట్లు ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నాడు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన ముఠా సభ్యుడు మూస్ వాలాను చంపాడని పోలీసులకు శుక్రవారం తెలిపాడు,
వైకల్యం కారణంగా ఎవరినీ విమానం ఎక్కకుండా అడ్డుకోకూడదు - డీజీసీఏ
కాగా సిద్దూ మూస్ వాలా హత్యపై రాజకీయ పార్టీలు ఒక దానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. ఎందుకంటే హత్యకు గురైన సిద్దూ మూస్ వాలా గాయకుడే కాకుండా.. ఒక మాజీ ఎమ్మెల్యే కూడా.. ఆయన కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అయితే వీఐపీలకు భద్రత ఉపసంహరణలో భాగంగా పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం సిద్దూ కు కూడా సెక్యూరిటీని తొలగించింది. ఇది జరిగిన ఒక రోజు తరువాత ఈ హత్య జరిగింది. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై కూడా రాజకీయంగా కామెంట్స్ రావడంతో ఆయన స్పందించారు. పంజాబ్‌లో ఎలాంటి సంఘటనలు జరిగినా వాటి చుట్టూ రాజకీయాలు ఉండకూడదని తాను నమ్ముతున్నానని అన్నారు. సిద్ధూ మూస్ వాలా హత్యకు గురికావడం నిజంగా దురదృష్టకరమని తెలిపారు.ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని పట్టుకునేందుకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ప్రయతిస్తున్నారని, నిందితులను త్వరగా అరెస్టు చేసి శిక్షిస్తామని తెలిపారు.
