కేవలం వికలాంగుడు అనే కారణంతో విమాన ప్రయాణం చేయనివ్వకపోవడం సరైంది కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అభిప్రాయపడింది. అలాంటి వ్యక్తులను ఇక నుంచి విమాన ప్రయాణాన్ని నిరాకరించకూడదని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
వైకల్యం ఉన్న వ్యక్తిని ప్రయాణించకుండా ఏ విమానయాన సంస్థ నిరాకరించకూడదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. వైకల్యం ఉన్న ప్రయాణికుడు మధ్యలో అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్ భావిస్తే.. అప్పుడు తప్పనిసరిగా విమానాశ్రయంలో వైద్యుడిని సంప్రదించి బోర్డింగ్ నిరాకరించాలా వద్దా అనే దానిపై తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు DGCA శుక్రవారం నిబంధనలను సవరించింది.
చాక్లెట్ తిని ఏడో తరగతి విద్యార్థి మృతి.. బీహార్ లో ఘటన
కొన్ని రోజుల కిందట ఇండిగోలో వికలాంగులకు విమాన ప్రయాణాన్ని నిరాకరించినందుకు ఆ విమానయాన సంస్థకు వారం రోజుల క్రితం డీజీసీఏ రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం డీజీసీఏ మరో నిర్ణయం తీసుకుంది. మే 9వ తేదీన ఓ వికలాంగ బాలుడు రాంచీ-హైదరాబాద్ విమానం ఎక్కేందుకు వెళ్లినప్పుడు ఇండిగో ఎయిర్ లైన్స్ అతడికి అడ్డుచెప్పింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా విమానంలోకి ఎక్కలేదు. ఈ ఘటన చర్చనీయాశం అయ్యింది.
కరోనా కేసులు పెరుగుతున్నాయ్..!! తెలంగాణకు కేంద్రం అలర్ట్
ఈ ఘటన నేపథ్యంలో మే 28వ తేదీన డీజీసీఏ రెగ్యులేటర్ సమావేశం అయ్యింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను నివారించడానికి, సొంత నిబంధనలను పునఃసమీక్షిస్తామని తెలిపింది. బోర్డింగ్ నిరాకరించే నిర్ణయం తీసుకునే ముందు విమానయాన సంస్థలు ప్రయాణీకుల ఆరోగ్యంపై ఆ ఎయిర్ పోర్టు డాక్టర్ నుంచి రాతపూర్వక అభిప్రాయాన్ని తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. DGCA శుక్రవారం జారీ చేసిన ముసాయిదా నిబంధనలలో ‘‘వైకల్యం ఆధారంగా ఏ వ్యక్తి క్యారేజ్‌ను ఎయిర్‌లైన్ తిరస్కరించదు’’ అని పేర్కొంది.
ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న స్ట్రీట్ కాజ్ - వీబీఐటీ
జులై 2లోగా ముసాయిదా నిబంధనలపై అభిప్రాయాలు పంపాలని డీజీసీఏ రెగ్యులేటర్ ప్రజలను కోరింది, ఆ తర్వాత తుది నిబంధనలను విడుదల చేస్తామని తెలిపింది. కాగా ఈ ఘటనపై ఇండిగో సీఈవో రోనోజోయ్ దత్తా మే 9వ తేదీనే విచారం వ్యక్తం చేశారు. ఆ వికలాంగుడికి ఎలక్ట్రిక్ వీల్‌చైర్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు.
భూకబ్జా ఆరోపణలు.. బెదిరింపులు, బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై కేసు నమోదు
ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం కావడంతో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని ట్వీట్ చేశారు. ‘‘ ఎవరికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు. నేను ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నాను. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాను. ’’ అని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా.. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు తమ నిబంధనలపై పునరాలోచించి అవసరమైన మార్పులు తీసుకువస్తామని డీజీసీఏ గతంలోనే చెప్పింది.
