Asianet News TeluguAsianet News Telugu

లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను కొడవలితో నరికి చంపిన వ్యక్తి.. జైలులో ఆత్మహత్య

కేరళలో ఓ దుండగుడు తనతో సహచర్యం చేసిన మహిళను గురువారం కొడవలితో పట్టపగలే బహిరంగంగా నరికి చంపేశాడు. స్థానికులు అతడిని ఆపి పోలీసులకు అప్పగించారు. జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆ దుండగుడు ఆదివారం వాష్ రూమ్‌కు వెళ్లి దోతితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 

kerala man hacks to death live in partner and kills self in prison
Author
First Published Dec 18, 2022, 3:36 PM IST

తిరువనంతపురం: కేరళలో 46 ఏళ్ల వ్యక్తి తనతో సహచర్యం చేస్తున్న మహిళను నరికి చంపేశాడు. బహుశా ఆమె వేరేవారితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నదనే అనుమానంతో ఆమెను గురువారం పట్టపగలే నడి రోడ్డుపై హతమార్చాడు. ఈ కేసులో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు జైలులో వాష్ రూమ్‌కు వెళ్లి తన దోతీని ఉరితాడు చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళలోని పూజప్పుర జిల్లా వళాయిలా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

నిందితుడు రాజేశ్ పూజప్పుర జిల్లా కారాగారంలో మరణించినట్టు జైలు అధికారులకు తమకు తెలియజేశారని పూజప్పుర పోలీసులు తెలిపారు. రాజేశ్ తన దోతీ సహాయంతో ఉరి వేసుకున్నాడని జైలులోని కొందరు ఖైదీలు తెలిపారు. అతని బాడీని జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.

రాజేశ్, సింధూ 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వారి పెళ్లిని అధికారికంగా నమోదు చేసుకోలేదు. కానీ, ఓ దేవాలయంలో ఒక్కటయ్యారు. పలోడ్ సమీపంలోని నాన్నియోడ్‌కు చెందిన సింధు, పతానపురానికి చెందిన రాజేశ్ ఇద్దరూ ఇష్టపడ్డారు. కుటుంబం ఆదేశాలను ధిక్కరించి ఒక్కటిగా జీవించారు. రాజేశ్ నాన్నియోడ్‌కే వచ్చి జీవించారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. కానీ, కొంతకాలంగా సింధును రాజేశ్ అనుమానించాడు. ఆమె మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నదని ఆరోపించాడు. ఈ కారణంగా ఇద్దరికీ గొడవలు జరిగాయి. దీంతో సుమారు నెల క్రితం ఆమె తన సోదరి ఇంటికి వెళ్లింది. అయినా.. రాజేశ్‌ను మాత్రం ఆ అనుమానం భూతం వదల్లేదు.

Also Read: భార్యను నరికి చంపిన భర్త.. 12 ముక్కలుగా కట్ చేసి..! కుక్కలు తింటూ ఉండగా పోలీసులకు సమాచారం.. వెలుగులోకి హత్య

సింధు గురువారం తిరువనంతపురంలోని ఓ జాబ్ కన్సల్టెన్సీకి బయల్దేరింది. నెయ్యట్టింకర దగ్గర ఓ హెల్త్ క్లినిక్‌లో ఆమెను హోమ్ నర్స్‌గతా కన్సల్టెన్సీ అపాయింట్ చేసింది. ఆమె బస్సులో వెళ్లుతూ ఉండగా నాన్నియోడ్ బస్టాండ్‌లో నిలిచిన రాజేశ్ చూశాడు. వెంటనే సమీపంలోని నేడుమంగడుకు వెళ్లాడు. అదే బస్సు ఎక్కాడు. కానీ, వెంట తీసుకెళ్లిన కొడవలి దాచిపెట్టాడు. 

సింధు బస్సు నుంచి దిగగానే రాజేశ్ వెంటనే ఆమెను కత్తితో నరికాడు. తొలుత ఆమె మెడపై వేటు వేయగా సహాయం కోసం ఆమె అర్థించింది. మరో వేటు తలపై వేశాడు. స్థానికు యువత అతడిని ఆపడానికి ప్రయత్నించే లోపే ఆయన ఆమెపై మరిన్ని వేట్లు వేశాడు. ఆమె కుప్పకూలిపోయింది. యువకులు అతడిని ఆపి పోలీసులకు పట్టించారు. ఈ ఘటన పట్టపగలే వళాయిలాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ పంప్ వద్ద ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios