Asianet News TeluguAsianet News Telugu

భార్యను నరికి చంపిన భర్త.. 12 ముక్కలుగా కట్ చేసి..! కుక్కలు తింటూ ఉండగా పోలీసులకు సమాచారం.. వెలుగులోకి హత్య

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన రెండో భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఓ పాత ఇంటిలో పడేశాడు. బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు ఫైల్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 

husband hacks wife cuts her body into 12 pieces in jharkhand
Author
First Published Dec 18, 2022, 1:31 PM IST

రాంచీ: శ్రద్ధా వాకర్ దారుణ హత్య ఘటన మరువకముందే అలాంటి తీరులోనే జరిగిన నేరాలు ముందుకు వస్తున్నాయి. దాడి చేసి దారుణంగా హతమార్చడం.. ఆ తర్వాత డెడ్ బాడీని ముక్కలుగా నరికి కనిపించని చోట పడేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఢిల్లీ మర్డర్ కేసు తరహాలోనే హత్య జరిగింది. భార్యను భర్త నరికి చంపేశాడు. ఆమె డెడ్ బాడీని 12 ముక్కులు చేసి ఓ పురాతన ఇంటిలో పడేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంలో నేరం వెలుగులోకి వచ్చింది.

జార్ఖండ్‌లోని సాహెబ్ గంజ్‌, బోరియో పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సంతాలి మోమిన్ తోలా ఏరియాలో ఓ పురాతన ఇంటిలో శరీర అవయవాలను పోలీసులు రికవరీ చేసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పోలీసులు రికవరీ చేసుకున్నారు. అక్కడ కొత్తగా అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దాని వెనుకాల కొన్ని కుక్కలు ఈ శరీర భాగాలను పీక్కుతినే పనిలో పడ్డాయి. అవి మనిషి శరీర భాగాలుగా అనుమానించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు స్పాట్‌కు వచ్చి ఆ బాడీ పీస్‌లను రికవరీ చేసుకున్నట్టు జాతీయ మీడియా సంస్థ ఒకటి రిపోర్ట్ చేసింది.

22 ఏళ్ల రుబికా పహదిన్‌ను పెళ్లి చేసుకోవాలని దిల్దార్ అన్సారీ ప్రలోభ పెట్టాడు. పెళ్లి చేసుకున్నాడు. కానీ, దిల్దార్ అన్సారీకి ఇది వరకే పెళ్లి అయింది. రెండో భార్యగా రుబికాను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులు రెండేళ్లుగా ఒకరికి ఒకరు పరిచయం. రుబికా ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన యువతి.

యువతి కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమ కూతురు కనిపించడం లేదని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా ఆమె శరీర భాగాలు కనిపించాయి. 

Also Read: ‘‘నన్ను చంపేయ్.. బతికొచ్చి అద్భుతాలు సృష్టిస్తాను’’.. హత్యకేసులో షాకింగ్ విషయాలు..

సాహెబ్‌గంజ్ ఎస్పీ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ, ప్రిమిటిల్ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన 22 ఏళ్ల మహిళ శరీర భాగాలు సాహిబ్‌గంజ్‌లో కనిపించాయని తెలిపారు. 12 శరీర భాగాలు లభించాయని, మరికొన్ని ఇంకా దొరకాల్సి ఉన్నదని వివరించారు. వాటి కోసం గాలింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ఆమె భర్త దిల్దార్ అన్సారీని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. మరణించిన మహిళ దిల్దార్ అన్సారీకి రెండో భార్య అని వివరించారు.

ఆ మహిళ శరీరాన్ని ముక్కలుగా నరకడానికి నిందితుడు ఓ పదునైన ఎలక్ట్రిక్ కట్టర్‌ను వినియోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని వివరించారు. 

ఇదిలా ఉండగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని ప్రతిపక్షంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహించింది. మైనార్టీ కమ్యూనిటీకి చెందిన కొందరు దుండగులు ఆడబిడ్డలపై దాష్టీకాలకు దిగుతున్నారని, హేమంత్ సర్కారు హయాంలో ఈ ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios