Asianet News TeluguAsianet News Telugu

కేరళ గోల్డ్ స్కాంతో తెలంగాణకు లింకులు.. డబ్బులు హైదరాబాద్‌ నుంచే..?

దేశంలో సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు కస్టమ్స్  అనుమానిస్తోంది.

Kerala Gold Smuggling Case: Customs Officials Suspect Hyderabad Link
Author
Kerala, First Published Jul 19, 2020, 2:35 PM IST

దేశంలో సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు కస్టమ్స్  అనుమానిస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకమైన నగదు చెల్లింపులు హైదరాబాద్ నుంచే జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు.

కోట్లాది రూపాయల విలువ చేసే బంగారం కొనేందుకు నిందితులు అడ్డదారుల్లో హవాలా మార్గాల్లో చెల్లిస్తారనే విషయం తెలిసిందే. ఈ కేసులో కోట్ల రూపాయలను హైదరాబాద్ నుంచి హవాలా రూపంలో దుబాయ్‌కి చెల్లింపు చేశారన్న సమాచారంపై కస్టమ్స్ ఆరా తీస్తోంది.

Also Read:కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: స్వప్న సురేష్, సందీప్ అరెస్టు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేశ్, సందీప్ నాయర్‌లను అరెస్ట్ చేసింది. కాగా ఈ కేసులో ఏకంగా కేరళ సీఎం కార్యాలయం ప్రమేయం వుందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నిందితులతో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ కార్యదర్శి ఎం. శివశంకర్‌పై ముఖ్యమంత్రి వేటు వేశారు.

Also Read:గోల్డ్ స్మగ్లింగ్, చిక్కుల్లో సీఎం: అధికారికి ఉద్వాసన, అసలేమైంది?

ఈ నెల 6వ తేదీన దుబాయ్‌ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపుపరం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దౌత్య మార్గంలో తరలించిన రూ.15 కోట్ల విలువైన బంగారం విమానాశ్రయంలో పట్టుకోవడం కలకలం రేపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios