కేరళలో విషాదం.. వెయ్యి సొరంగాలు తవ్వి నీటి ఎద్దడి తీర్చిన వ్యక్తి ఆత్మహత్య..
ప్రజల నీటి ఎద్దడి తీర్చడంలో అతడిది అందెవేసిన చేయి. నీటిని భూమిలో నిలిపి ఉంచేలా చేయడంలో ఏ భూగర్భశాస్త్రవేత్తా అతని ముందు పనికిరాడు. అలా వెయ్యి సొరంగాలు తవ్వాడు. కానీ చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కేరళ : దక్షిణ కర్ణాటకలోనూ.. కేరళలోని ఉత్తర కాసర రోడ్డు జిల్లాలోనూ దాదాపు 1000 సొరంగాలు తవ్విన ఓ వ్యక్తి బలవన్మరణం చెందాడు. ఈ సొరంగాల ద్వారా నీటి ఎద్దడిని తొలగించడంలో ఆయన కీలకపాత్ర పోషించాడు. అతనే సి. కున్హాంబు. 72 ఏళ్ల వయసులో అతను ఊరికి వేలాడుతూ కనిపించాడు. అతని ఆకస్మిక మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. రెండు రోజులకిందట అతను తన నివాసంలో చనిపోయి కనిపించాడు. విషయం తెలిసి ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం దానిని ఆత్మహత్యగా అంచానకు వచ్చారు. శుక్రవారం దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దక్షిణ కర్ణాటకలో.. కేరళలోని ఉత్తర కాసర రోడ్డు జిల్లా వరకు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అతని పేరు బాగా తెలుసు. భూగర్భ జలాలను పెంచడం కోసం నేలకు ఉన్న గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకునేలా ఆయన పనిచేసేవాడు. ఈ మేరకు సొరంగబావులు తవ్వేవాడు. అలా చేయడంలో కున్హాంబుది అందవేసిన చేయి. మంచి పేరు కూడా ఉంది. ‘కున్హాంబుకు 14ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి సొరంగాలు తవ్వుతున్నాడు. ఎంతోమంది భౌగోళిక శాస్త్రవేత్తల కంటే కున్హాంబుకు ఉన్న భౌగోళిక అవగాహన ఎంతో గొప్పగా ఉంటుంది’ అని జాగ్రఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి గోవిందన్ కుట్టి ఓ సందర్భంగా తెలిపారు.
నమ్మి ఇంటి తాళాలు చేతికి ఇస్తే.. మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారం.. పొరుగువారు ధైర్యం చెప్పడంతో