Asianet News TeluguAsianet News Telugu

నమ్మి ఇంటి తాళాలు చేతికి ఇస్తే.. మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారం.. పొరుగువారు ధైర్యం చెప్పడంతో

భద్రత కోసం కుమార్తెను ఇంట్లో ఉంచి లాక్‌ వేసిన తల్లి.. తాళం చెవిని పొరుగు వ్యక్తికి ఇవ్వగా పలుసార్లు రేప్‌ తల్లి పని కోసం బయటకు వెళ్లేటప్పుడు కూతుర్ని ఇంట్లో ఉంచి లాక్‌ చేసేది. ఇంటి తాళాలను ఎదురింట్లో ఉండే టైలర్‌కు ఇచ్చేది. 

Teen Locked At Home For Safety Raped Repeatedly By Neighbour Near Mumbai
Author
First Published Jan 21, 2023, 5:37 AM IST

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులపై లైంగికదాడులు జరుగుతున్నాయి.  అతివల రక్షణ ఎడారిలో ఎండమావిగా మారిపోయింది.  అతివలపై జరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 

భద్రత కోసం కుమార్తెను ఇంట్లో ఉంచి తాళం వేసి.. తాళం చెవిని ఎదురింటి వ్యక్తికి ఇవ్వగా .. ఆ వ్యక్తి అదే అదునుగా భావించి.. ఆ యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం  మహారాష్ట్రలోని థానే నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి మూడు నెలల కిందట లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. ఈ దారుణం తర్వాత తన కుమార్తె భద్రత కోసం ఆ తల్లి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నది. పని కోసం బయటకు వెళ్లేటప్పుడల్లా కూతుర్ని ఇంట్లో ఉంచి తాళం వేసి.. ఆ ఇంటి తాళాన్ని ఎదురింట్లో ఉండే టైలర్‌కు ఇచ్చేది.

ఈ క్రమంలో ఆ వ్యక్తి .. మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గురువారం రాత్రి ఫిర్యాదు చేసింది, దాని ఆధారంగా పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నిందితుడిపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. బాధితురాలు, నిందితుడు నగరంలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారని, డిసెంబర్ మధ్యలో నేరం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి తల్లి స్థానిక మదర్సాలో వంటమనిషిగా పనిచేస్తోంది. ఆమె కూడా సాయంత్రం వేళల్లో వేరే చోట పని చేస్తుంది. బాధితురాలి తండ్రి మూడు నెలల క్రితం ఆమెపై అత్యాచారం చేసాడు. దానిపై ఫిర్యాదు చేశాడు. అయితే, సంఘటన తర్వాత, సాయంత్రం పని కోసం బయటకు వెళ్లే ముందు బాలిక తల్లి ఆమెను ఇంటికి తాళం వేయడం ప్రారంభించింది. ఆమె తమ ఇంటి ఎదురుగా ఉండే టైలర్‌కి తాళాలు ఇచ్చి వెళ్లేదని షిల్-దైఘర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

గత నెలలో బాధితురాలు తన బట్టలు మార్చుకోవడానికి ఇంటి ముందున్న వ్యక్తి (టైలర్) మొదట లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లినప్పుడల్లా ఆ టైలర్‌కు తాళాలు ఇచ్చేంది. ఇదే అదునుగా భావించినా ఆ కామాంధుడు బాలికను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. బాలిక భయాందోళనకు గురైనందున.. తన కష్టాలను ఎవరికీ వెల్లడించలేదని, జనవరి 14 న నిందితులకు తెలియకుండా.. ఆమె తన మొబైల్ ఫోన్‌లో నేరాన్ని వీడియో రికార్డ్ చేసిందని, ఆ వీడియో సాక్ష్యాన్ని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. 

జనవరి 19న..టైలర్ బాధితురాలిని తన ఇంటికి ఈడ్చుకెళ్తుండగా, అమ్మాయికి తెలిసిన ఒక మహిళ అక్కడికి వచ్చి అతని చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ మైనర్ ధైర్యం చేసి ఆ మహిళకు తన అనుభవాన్ని చెప్పి వీడియో కూడా చూపించింది. ఆ మహిళ ధైర్యం చెప్పడంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక నేరాల (పోక్సో) చట్టం క్రింద కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios