దారుణం: 20 ఏళ్లుగా కొనసాగుతున్న లైంగికదాడి పెళ్లైనా వదలని మతగురువులు

Kerala church rape case: Statements by the victim reveal evidence against Orthodox priests
Highlights

20 ఏళ్లుగా ఓ మహిళపై మత గురువులు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. పెళ్లైనా కూడ ఆమెను వదల్లేదు. ఒక మతగురువు దాష్టీకంపై ముగ్గురికి ఫిర్యాదు చేస్తే నలుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

తిరువనంతపురం:గత నెలలో  తన భార్యపై నలుగురు మతగురువులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని  చర్చి మేనేజ్‌మెంట్‌కు ఓ వ్యక్తి  ఫిర్యాదు చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది  దీంతో  పోలీసులు రంగంలోకి దిగి బాధిత మహిళ నుండి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు.

20 ఏళ్ల క్రితమే ఓ చర్చి ఫాదర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని  బాధితురాలు  చెప్పారు. అంతేకాదు తానను వివాహం చేసుకొంటానని కూడ నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని  ఆమె ఆరోపించింది.

అంతేకాదు పాప పరిహారమంటూ  ముగ్గురూ మత గురువును ఆశ్రయిస్తే  బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి వాళ్లు కూడ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని  ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైనా కానీ మత గురువుల అరాచకాలు మాత్రం ఆగలేదు. 2006 లో ఆమెకు వివాహం జరిగింది. అయితే అప్పటి నుండి కూడ ఆమె భర్తకు తెలియకుండా ఈ నలుగురు మత గురువులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు.

ఈ వేధింపులను భరించలేక ఆమె తన భర్తకు అసలు విషయాన్ని చెప్పింది.దీంతో తన భార్యపై మత గురువుల  లైంగిక దాడిని బయటపెట్టాడు..  బాధితురాలి ఫిర్యాదు మేరకు కోర్టు  ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా  మత గురువులపై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.  20 ఏళ్లుగా ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడుతున్నారంటే వారిని మనుషుులుగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.  మత గురువులు మృగాళ్లుగా ప్రవర్తించారని కోర్టు అభిప్రాయపడింది.

నిందితులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. జాబ్ మాథ్యూ అనే నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.  

loader