ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంలు మనీస్ సిసోడియా, సత్యేందర్ జైన్ ల అరెస్టుకు నిరసనగా అరవింద్ కేజ్రీవాల్ నేడు హోలీ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఆయన ఈరోజంతా మెడిటేషన్ చేస్తున్నారు. అంతకు ముందు రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. 

ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ అరెస్టులకు నిరసనగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ శ్రేయస్సు కోసం తన రోజంతా ధ్యానం, ప్రార్థనలు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 10 గంటలుకు మెడిటేషన్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఏడు గంటల పాటు ఆయన దీనిని కొనసాగించనున్నారు. హోలీని జరుపుకోకుండానే ఆయన ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నారు. 

బిగ్ బాస్ ఫేమ్ అర్చన‌తో అనుచిత ప్రవర్తన.. ప్రియాంక గాంధీ పీఏ సందీప్‌పై కేసు నమోదు..

ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మంచి పనులు చేసే వారిని అరెస్టు చేస్తున్నారని, దేశాన్ని దోచుకునే వారు తప్పించుకుంటున్నారని, హోలీ రోజున దేశం కోసం ప్రార్థిస్తానని కేజ్రీవాల్ మంగళవారం తెలియజేశారు. డిజిటల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు అధ్వాన్నంగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను మెరుగుపరిచిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలులో ఉన్నారని ఆరోపించారు. 

Scroll to load tweet…

ప్రజలకు మంచి విద్య, మంచి వైద్య సదుపాయాలు కల్పించే వారిని, దేశాన్ని దోచుకునే వారికి అండగా నిలిచే వారిని ప్రధాని జైళ్లలో పెట్టడం ఆందోళన కలిగిస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. తాను రేపు (బుధవారం) దేశం కోసం ధ్యానం చేసి ప్రార్థిస్తానని తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నది తప్పని భావిస్తే, మీరు కూడా దేశం గురించి ఆందోళన చెందుతుంటే, హోలీ జరుపుకున్న తర్వాత, దేశం కోసం ప్రార్థించడానికి సమయం కేటాయించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’ అని కేజ్రీవాల్ కోరారు. 

Scroll to load tweet…

జైన్, సిసోడియా జైలులో ఉండటంపై తాను ఆందోళన చెందడం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. వారిద్దరూ ధైర్యవంతులని, దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నారన్నారని తెలిపారు. కానీ దేశంలో నెలకొన్న దయనీయ స్థితి తనను ఆందోళనకు గురి చేస్తోందన్నారు.

తండ్రి లైంగికంగా వేధించాడని వెల్లడించడం తప్పేం కాదు.. అది నా నిజాయితీ.. తప్పుచేసినవాడు సిగ్గుపడాలి: ఖుష్బూ

ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసి సోమవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో జైన్ ను గత ఏడాది మేలో ఈడీ అరెస్టు చేసింది. వీరిద్దరూ ఇటీవల ఢిల్లీ మంత్రివర్గానికి రాజీనామా చేశారు.