ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రజల మనస్తత్వం పూర్తిగా మారిపోయిందని జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవల్ అన్నారు. ఇక వారెప్పుడూ ఉగ్రవాదానికి, పాకిస్థాన్ కు మద్దతు తెలపరని ధీమా వ్యక్తం చేశారు. 

2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్ ప్రజల మూడ్ పూర్తిగా మారిపోయింద‌ని జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు (NSA) అజిత్ దోవ‌ల్ అన్నారు. అప్ప‌టి నుంచి కాశ్మీరీలు పాకిస్థాన్, ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ‘‘2019 తర్వాత కశ్మీర్ ప్రజల మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్, ఉగ్రవాదానికి ప్రజలు ఇక ఏమాత్రం అనుకూలంగా లేరు ’’ అని ఆయ‌న అన్నారు. 

Presidential Election: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. అధికారిక ప్రకటన

పాకిస్తాన్ తో సాధారణ సంబంధాలను కలిగి ఉండాలని భారత్ కోరుకుంటోందని, అయితే న్యూఢిల్లీకి ఉగ్రవాదంపై స‌హ‌నం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని అన్నారు. భార‌త్ ఎట్టిపరిస్థితుల్లోనూ శాంతి కోసం అడుక్కోదని ఆయ‌న తెలిపారు.‘‘మన శత్రువు ఛాయిస్ ఆధారంగా మనం శాంతి, యుద్దం చేయలేము. మన ప్రయోజనాలను కాపాడుకోవాలంటే, ఎప్పుడు, ఎవరితో, ఏ షరతులతో శాంతిని నెలకొల్పాలో మనమే నిర్ణయించుకుంటాం’’ అని అజిత్ దోవల్ వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.

Scroll to load tweet…

2016లో పఠాన్ కోట్ వైమానిక దళ స్థావరంపై పొరుగు దేశానికి చెందిన ఉగ్రవాద గ్రూపులు దాడి చేసిన తరువాత భారత్, పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉరీలోని భారత సైనిక క్యాంప్‌పై దాడితో సహా వరుస దాడుల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లు మరణించినందుకు ప్రతిస్పందనగా ఫిబ్రవరి 26, 2019 న పాకిస్తాన్ లోని జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని భారతదేశం వైమానిక దాడులు చేయడంతో ఉద్రిక్తత చెలరేగింది. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాలను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు భారత్ ప్రకటించిన తర్వాత సంబంధాలు మరింత దిగ‌జారాయి. 

Maharashtra: రెబల్ మినిస్టర్‌పై శివసేన వేటు.. చీఫ్ విప్‌గా తొలగింపు.. అధికారం కోసం చీట్ చేయం: రెబల్ మినిస్టర్

జమ్మూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉందని, ఎప్పటికీ ఉంటుందని భారత్ పదేపదే పేర్కొంది. వాస్తవికతను అంగీకరించాలని, భారత వ్యతిరేక ప్రచారాన్నంతా ఆపాలని పాకిస్తాన్ కు సూచించింది. ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణాన్ని ఇస్లామాబాద్ కల్పిస్తే పొరుగు దేశాలతో సంబంధాలు కొనసాగించవచ్చని భారత్‌ పాకిస్థాన్‌కు తెలిపింది. కాగా చైనాతో సరిహద్దు వివాదంపై దోవల్ మాట్లాడుతూ..‘‘ చైనాతో మనకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాదేశిక వివాదం ఉంది. మేము చైనాకు మన ఉద్దేశాలను చాలా స్పష్టంగా చెప్పాం. ఎలాంటి అతిక్ర‌మ‌ణ‌ను మ‌నం సహించబోమన్న వాస్తవం వారికి తెలుసు ’’ అని ఆయ‌న అన్నారు.