చూసి రాయండి.. బుఖారీకి ఏం జరిగిందో గుర్తుందా..? జర్నలిస్టులకు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

First Published 24, Jun 2018, 11:52 AM IST
kashmir bjp mla lal singh warns to journlists
Highlights

చూసి రాయండి.. బుఖారీకి ఏం జరిగిందో గుర్తుందా..? జర్నలిస్టులకు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. అడ్డదిడ్డంగా వార్తలు రాస్తే బుఖారీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే లాల్ సింగ్. జర్నలిస్టుల వార్తల సేకరణ.. కథనాల ప్రచురణ తదితర అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన... రాష్ట్రంలో జర్నలిస్టుులు ఓ తప్పుడు వాతావరణాన్ని సృష్టించారు.. మీ హద్దులు మీరే నిర్ణయించుకోవాలి.. మీ గురించి మీరు ఆలోచించుకోండి.. షుజ్జత్ బుఖారీలా జీవించాలని భావిస్తే.. మీ ఇష్టం జాగ్రత్త పడండి అంటూ ట్వీట్ చేశారు. చివర్లో జర్నలిస్టులకు స్వాతంత్ర్యం ఉందని.. అది జాతిని.. జాతీయతా భావాన్ని పణంగా పెట్టేలా ఉండకూడదని లాల్ సింగ్ అన్నారు.


 

loader