రూపాయికి కిలో బియ్యం, ఉచిత టీవీలు.. ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర

karunanidhi Schemes as a chief minister
Highlights

తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి.. 19 సంవత్సరాల పాటు ఆ హోదాలో దేశంలోని ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారు. 

తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి.. 19 సంవత్సరాల పాటు ఆ హోదాలో దేశంలోని ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారు. సీఎంగా ఆయన తీసుకున్న సాహోసపేతమైన నిర్ణయాలు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి.

భూగరిష్ట పరిమితిని 15 ఎకరాలకు తగ్గించడం.. విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల వారికి 25 శాతం నుంచి 31 శాతానికి పెంచడం, అన్ని కులాల వారికి ఆలయ పూజారులుగా నియమించేందుకు వీలుగా చట్టం, తల్లిదండ్రుల ఆస్తుల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించడం, వ్యవసాయం పంపుసెట్లకు ఉచిత విద్యుత్

చెన్నైకి మెట్రో, రూపాయికి కిలో బియ్యం, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఉచిత ప్రజా ఆరోగ్య భీమా, దళితులకు ఉచిత ఇళ్లు, చేతితో లాగే రిక్షాల నిషేధంతో పాటు ఆయన ప్రవేశ పెట్టిన ఉచిత టీవీల పథకం దేశంలో సంచలనం సృష్టించింది.. ఈ ప్రజాకర్షక పథకాలను దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు కూడా అనుసరించారు.
 

loader