మహిళతో ఎస్పీ రాసలీలలు.. రచ్చ చేసిన ఎస్పీ భార్య

First Published 16, Jul 2018, 9:53 AM IST
Karnataka: women  accuses her husband SP of affair with another women
Highlights

 దావణగెరెకు చెందిన ఓ మహిళతో తన భర్త సంబంధం పెట్టుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఐపీఎస్‌ అధికారి భార్య రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. 

గౌరవప్రదమైన పోలీసు అధికారి హోదాలో ఉండి.. ఓ ఐపీఎస్ అధికారి చేయరాని తప్పు చేశాడు. వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆయన భార్య.. నానా రచ్చ చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..ఓ ఐపీఎస్‌ అధికారికి పరాయి మహిళతో ఉన్న వివాహేతర సంబంధంపై దర్యాప్తునకు రాష్ట్ర హోం శాఖ ఆదేశించింది. ఈ మేరకు కోరమంగల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దావణగెరెకు చెందిన ఓ మహిళతో తన భర్త సంబంధం పెట్టుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఐపీఎస్‌ అధికారి భార్య రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. 

దీనికి సంబంధించిన దాఖలాలను డీజీపీ ముందు ఉంచారు. దీనిపై స్థానిక కోరమంగల పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేయాలని డీజీపీ సూచించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా కోరమంగల పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన భర్త, కోరమంగల పోలీసులకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. 

తన భార్య మానసిక వ్యాధిగ్రస్తురాలని, ఆమెకు లేనిపోని మాటలు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసేలా కొందరు ప్రోత్సహించారని ఎస్పీ ఆరోపించారు. బాధితురాలి అర్జీ పరిశీలించిన న్యాయస్థానం కేసు దాఖలు చేసుకుని విచారణ చేపట్టాలని కోరమంగల పోలీసుల్ని ఆదేశించింది. ఎస్పీ డాక్టర్‌ భీమాశంకర్‌ గుళేదకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణపై విచారణకు ఆదేశించినట్లు డీసీఎం డాక్టర్‌ పరమేశ్వర్‌ ధ్రువీకరించారు.

loader