కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణపై నెలకొన్న హైడ్రామాకు తాత్కాలికంగా విరామం పలికింది. బలనిరూపణకై రెండురోజులుగా అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. బలనిరూపణకు బీజేపీ పట్టుబట్టింది. స్పీకర్ రమేష్ కుమార్ మాత్రం చర్చ అయిన తర్వాతే బలనిరూపణకు అవకాశం ఇస్తానని తేల్చి చెప్పారు. 

దీంతో అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీలు ఎవరికి వారు నానా హంగామా చేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఉద్రిక్త నడుమ సభ సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ రమేష్ కుమార్.

అసెంబ్లీ వాయిదా వేయడంపై బీజేపీ శాసన సభాపక్ష నేత యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలపరీక్షను చేపట్టాలన్న గవర్నర్‌ సూచనను స్పీకర్ తోసిపుచ్చడంపై మండిపడ్డారు. విశ్వాస పరీక్షను వెంటనే నిర్వహించాలని తాము పట్టుబట్టిన స్పీకర్ ఏకపక్షంగా వాయిదా వేశారంటూ విరుచుకుపడ్డారు. 

ఇకపోతే కర్ణాటకలో బలపరీక్షపై అంతకుముందు గవర్నర్‌ వాజుభాయ్ వాలా డెడ్ లైన్ విధించారు. శుక్రవారం మధ్యాహ్నాం 1.30 గంటలలోపు బలనిరూపణ చేపట్టాలని ఆదేశించారు. అయితే గవర్నర్ ఆదేశాలపై స్పీకర్ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను గవర్నర్ శాసించలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో సీఎం కుమారస్వామికి ఇచ్చిన డెడ్ లైన్ దాటిపోయింది. అయితే బలపరీక్షను తక్షణమే ఎదుర్కోవాలని తనకు గవర్నర్‌ రాసిన లేఖను లవ్‌ లెటర్‌ అంటూ కుమార స్వామి అభివర్ణించారు. విశ్వాస పరీక్షపై చర్చ ఎలా సాగాలనేదానిపై గవర్నర్‌ నిర్ధేశించలేరని స్పష్టం చేశారు. 

గవర్నర్‌ ఆదేశాలు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్వర్వులకు విరుద్ధంగా ఉన్నాయని కుమార స్వామి మండిపడ్డారు. అసెంబ్లీలో బలపరీక్షపై నిర్ణయాన్ని తాను స్పీకర్‌ నిర్ణయానికి వదిలేస్తున్నట్లు తెలిపారు. సభ నడిపే తీరును ఢిల్లీ శాసిచలేదని విమ ర్శించారు. గవర్నర్ పంపిన లేఖ నుంచి తనను కాపాడాలని కోరుతున్నానని స్పీకర్ ను కోరారు. 

గవర్నర్‌కు తాను గౌరవం ఇస్తానని, అయితే ఆయన నుంచి తనకు వచ్చిన రెండో లవ్‌ లెటర్‌ బాధించిందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేల బేరసారాల విషయం గవర్నర్‌కు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అంటూ నిలదీశారు సీఎం కుమారస్వామి. మెుత్తానికి సభ అయితే మాత్రం సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ రమేష్ కుమార్. 

ఈ వార్తలు కూడా చదవండి

కర్ణాటక క్రైసిస్: మూడో దఫా గవర్నర్ డెడ్‌లైన్, కోర్టుకు కుమారస్వామి

కర్ణాటక సంక్షోభం: బలపరీక్ష డౌటే, బాంబు పేల్చిన సిద్ధరామయ్య

కర్ణాటక బలపరీక్షలో హైడ్రామా: ముగిసిన గవర్నర్ గడువు

యడ్యూరప్ప సీఎం కావాలని.. బీజేపీ ఎంపీ ఏం చేశారంటే...

కర్ణాటక సంక్షోభం: కాంగ్రెస్‌పై కుమారస్వామి వ్యాఖ్యలు, ఇరు వర్గాల వాగ్వాదం