ఎన్నికల ర్యాలీలో డబ్బులు విసిరి కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. డబ్బులు విసురుతున్న వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆయనపై  నాన్-కాగ్నిసబుల్ నేరం నమోదు చేశారు. 

కర్ణాటకలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రజలపై కరెన్సీ నోట్లు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ బుధవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఒకరోజు ముందు మంగళవారం ఇది చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఆయనపై నాన్ కాగ్నిసబుల్ నేరం నమోదు చేశారు.

యూపీఏ హయాంలో మోడీని ఇరికించడానికి సీబీఐ నాపై ఒత్తిడి చేసింది: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ఈ విషయంలో మండ్య పోలీస్ సూపరింటెండెంట్ యతీష్ ఎన్ వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. “ మేము ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నాన్-కాగ్నిసబుల్ అఫెన్స్ నమోదు చేశాం. ఈ కేసును కోర్టు ముందు ప్రవేశపెట్టి ఆదేశాలు జారీ చేస్తాం’’ అని ఆయన అన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఆయన రథయాత్ర చేపడుతున్నారు. 

Scroll to load tweet…

ఈ రథ యాత్ర మంగళవారం మండ్య తాలూకాలోని బెవినహళ్లి గ్రామంలోకి ప్రవేశించింది. ఈ ర్యాలీకి కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఈ రథయాత్రను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో వారిపై డీకే శివకుమార్ రూ.500 కరెన్సీ నోట్లను విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. కాగా.. డీకే శివ కుమార్ ప్రజలపై డబ్బులు విసరలేదని కాంగ్రెస్ పేర్కొంది. ఆయన ప్రచారంలో ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు డబ్బులు చెల్లిస్తున్నారని తెలిపింది. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఆయన డబ్బు పంపిణీ చేశాడనే ఆరోపణను పార్టీ ఖండించింది.

కరోనా కలవరం.. దేశంలో కొత్తగా 3,016 కోవిడ్ కేసులు.. నేడు ఢిల్లీ ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. శివకుమార్ వొక్కలిగ వర్గానికి చెందిన వ్యక్తి. ఈ సామాజిక వర్గం పాత మైసూరు లేదా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంది. అయితే ఎన్నికలకు ముందు తమ చేతులను బలోపేతం చేసుకోవాలని వొక్కలిగ సామాజికవర్గానికి పిలుపునిచ్చారు. మాండ్య జేడీఎస్ కంచుకోటగా ఉంది. జిల్లాలోని ఏడు స్థానాలను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రాంతీయ పార్టీ గెలుచుకుంది. మే ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే శివకుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రులు కావాలనే ఆశయంతో ఉన్నారు. దీంతో ఇరువురి మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి.
'మోదీ హటావో, దేశ్ బచావో'.. దేశ‌వ్యాప్తంగా ఆప్ పోస్టర్ల ప్రచారం
కాగా.. కేంద్ర ఎన్నికల కమిషన్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం షెడ్యూల్ ను ప్రకటించింది. మొత్తం 224 స్థానాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించనుంది. మే 10న పోలింగ్ ఉండగా.. మే 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఏప్రిల్ 13 గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 20వ తేదీ నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ కాగా.. ఏప్రిల్ 21 వరకు నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ఉంది.