New Delhi: ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశవ్యాప్తంగా 11 భాషల్లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించే కార్య‌క్ర‌మం ప్రారంభించింది. దేశ రాజధానిలో 'మోదీ హఠావో, దేశ్ బచావో' పోస్టర్లు వెలిసిన తర్వాత ఆప్ ఈ  ప్రచార కార్యక్రమం చేపట్టడం గమనార్హం.

Modi Hatao Desh Bachao-AAP poster campaign: ఆమ్ ఆద్మీ పార్టీ మ‌రోసారి కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), ప్ర‌ధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించింది. ఈ క్ర‌మంలోనే మోడీ, బీజేపీకి వ్య‌తిరేకంగా పోస్ట‌ర్ల తో ప్ర‌చార కార్య‌క్ర‌మం ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశవ్యాప్తంగా 11 భాషల్లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించే కార్య‌క్ర‌మం ప్రారంభించింది. దేశ రాజధానిలో 'మోదీ హఠావో, దేశ్ బచావో' పోస్టర్లు వెలసిన తర్వాత ఆప్ ఈ కార్యక్రమం ప్రారంభించడం గమనార్హం.

వివ‌రాల్లోకెల్తే.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో 'మోడీ హటావో, దేశ్ బచావో' పోస్టర్లను అతికించిన కొద్ది రోజులకే ఆ పార్టీ గురువారం దేశవ్యాప్తంగా 11 భాషల్లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించే కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్రధాని మోడీ విద్యార్హతలపై పోస్టర్ వార్ ప్రారంభ‌మైంది. దేశ రాజ‌ధానిలో 'క్యా భారత్ కే పీఎం కో పధే లిఖే హోనా చాహియే?' అంటూ పోస్టర్లు వెలిశాయి. 

Scroll to load tweet…

"ఆప్ మార్చి 30న దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో పోస్టర్లను ప్రదర్శిస్తుంది. పార్టీ అన్ని రాష్ట్ర యూనిట్లు తమ తమ రాష్ట్రాల్లో పోస్టర్లు అతికించమని కోరబడ్డాయి. పోస్టర్లు 11 భాషలలో ముద్రించారు" అని ఢిల్లీ ఆప్ చీఫ్, పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాగా, గత వారం దేశ రాజధాని అంతటా గోడలు, విద్యుత్ స్తంభాలపై 'మోదీ హఠావో, దేశ్ బచావో' అనే పోస్టర్లు కనిపించడంతో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. దేశ రాజధానిలో ప్రధాని మోడీని తొలగించాలని కోరుతూ వేలాది పోస్టర్లు కనిపించడంతో ఢిల్లీ పోలీసులు 100కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.

ఇలాంటి లక్ష పోస్టర్ల కోసం రెండు ప్రింటింగ్ ప్రెస్ లకు ఆర్డర్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపిన‌ట్టు ఇండియా టుడే నివేదించింది. అరెస్టయిన వారిలో ఇద్దరు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఉన్నారు. ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆప్ పోస్టర్ల తరువాత అనేక కేసులు నమోదయ్యాయి. 

Scroll to load tweet…

జంతర్ మంతర్, ఢిల్లీ అసెంబ్లీ వద్ద తన చివరి మూడు ప్రసంగాల్లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేరుగా ప్రధాని మెడీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగించారు. స్వాతంత్య్రోద్య‌మ‌ సమయంలో తమకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన వారిని బ్రిటిష్ వారు కూడా అరెస్టు చేయలేదంటూ బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆప్ ఈ పోస్టర్లపై అభ్యంతరకరంగా ఏముందని ప్రశ్నించింది.