కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అవినీతికి పాల్పడ్డాడని, ఆయనను అరెస్టు చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల సర్వే నిర్వహించడానికి సీఎం  ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించారని ఆరోపించింది. 

ఇంటింటికీ ఓటరు సమాచారాన్ని సేకరించేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఎన్నికల అవినీతికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనికి ప్రత్యక్ష బాధ్యత వహిస్తూ బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా బెంగళూరులో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

కొవాగ్జిన్‌కు ఆమోదంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.. ఆ మీడియా రిపోర్ట్స్‌ను ఖండించిన కేంద్రం..

ఓటర్లను ఇంటింటికీ ఉచితంగా సర్వే చేయడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికే పౌర సంస్థ ఆగస్టులో ఒక ప్రైవేట్ సంస్థకు అధికారం ఇచ్చిందని ఆయన అన్నారు. వారి లింగం, మాతృభాషకు సంబంధించిన సమాచారంతో పాటు ఓటరు ఐడీ, ఆధార్ వివరాలను కూడా సేకరించారని ఆరోపించారు. ఇది ఎన్నికల అవకతవకలకు పాల్పడటమే అవుతుందని తెలిపారు. దీనికి కారణం కర్ణాటక సీఎం అని అన్నారు. అందుకు ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

నేనేమైనా పారిపోతానా.. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా ట్రీట్ చేస్తారా : ఈడీపై హేమంత్ సోరెన్ ఫైర్

ఇలా సేకరించిన సమాచారం మొత్తం ప్రభుత్వ అప్లికేషన్ గరుడలో కాకుండా ప్రైవేట్ సంస్థకు చెందిన ‘డిజిటల్ సమీక్ష’ అప్లికేషన్‌లో పొందుపర్చారని సుర్జేవాలా ఆరోపించారు. సర్వే నిర్వహించిన సంస్థ వందలాది మంది బూత్ లెవల్ ఆఫీసర్లను (బీఎల్ వో) కూడా నియమించిందని చెప్పారు. ఈ బీఎల్ వోలకు ప్రభుత్వ ఉద్యోగులను పోలిన గుర్తింపు కార్డులు కూడా అందజేశారని ఆయన తెలిపారు.

షాకింగ్.. ప్రియురాలిని చంపి, నన్ను మోసం చేయద్దు అంటూ మృతదేహంతో వీడియో...

‘‘బీబీఎంపీ తరపున సర్వే చేయడానికి ప్రైవేట్ సంస్థకు ఎవరు అనుమతి ఇచ్చారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము? అలాంటి కాంట్రాక్టును ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎవరు సిఫార్సు చేసారు ? కాంట్రాక్టర్ పూర్వాపరాలను ఎందుకు తనిఖీ చేయలేదు? ’’ అని సూర్జేవాలా అన్నారు.