కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌కు బెదిరింపులు లేఖలు వచ్చాయి. అందులో గుర్తు తెలియని దుండగుడు సుదీప్ ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ బెదిరింపు లేఖలు వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం ఈ శాండల్‌వుడ్ స్టార్ ప్రైవేట్ వీడియోలను విడుదల చేస్తానని ఆ దుండగుడు తన బెదిరింపు లేఖలో పేర్కొన్నారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
NCERT పాఠ్యాంశాల్లో కీలక మార్పులు.. మహాత్మా గాంధీ, నాథూరామ్ గాడ్సే, ఆర్ఎస్ఎస్ వంటి అంశాల తొలగింపు !
సుదీప్ మేనేజర్ జాక్ మంజుకి బెదిరింపు లేఖలు వచ్చినట్లు సమాచారం. దీనిని ఆయన నటుడి దృష్టికి తీసుకెళ్లారు. తరువాత దీనిపై బెంగళూరులోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఐపీసీ సెక్షన్ 506, 504 కింద కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ లేఖలో సుదీప్‌పై కించపరిచే పదజాలం ఉందని నటుడి సన్నిహితురాలు మంజు తెలిపారు. ఇది ఆయన ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అని పేర్కొన్నారు.
బెంగళూరు నగర కమిషనర్ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు బెదిరింపు లేఖ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)కి బదిలీ చేశారు. కాగా.. తాను బీజేపీ తరఫున ప్రచారం మాత్రమే చేస్తానని, ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన సన్నిహితుడు, నిర్మాత మంజు కోసం టికెట్ తీసుకోవడం లేదని చెప్పారు.
