బీహార్ లో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్లపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం రచ్చ జరిగింది. దీనిపై అధికార మహాకూటమి, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఒకరిని మార్షల్స్ బయటకు ఎత్తుకొచ్చారు. 

శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక సంఘటనలపై బీహార్ అసెంబ్లీలో హై డ్రామా జరిగింది. సభలో గందరగోళం సృష్టిస్తున్నారనే కారణంతో బీజేపీ ఎమ్మెల్యే జీవేష్ మిశ్రాను స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ బయటకు లాక్కెళ్లారు. ఆయనను సభ నుంచి మార్షల్స్ బయటకు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాకు హిందీ, ఇంగ్లీష్ పెద్దగా రాదు.. వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

‘‘ఇదీ ప్రతిపక్షాల తీరు. రాష్ట్రంలో రామనవమి రోజున హిందువులపై జరిగిన దాడులు, హత్యలపై సభలో సమాధానం చెప్పాలని నేను ముఖ్యమంత్రిని కోరాను” అని సభ నుండి బయటకు వచ్చిన బీజేపీ శాసనసభ్యుడు జీవేష్ మిశ్రా మీడియాతో అన్నారు. ‘‘స్పీకర్ పక్షపాతంగా వ్యవహరించారు. అసెంబ్లీ నుంచి నన్ను బయటకు పంపించారు. ప్రజాస్వామ్యం నేడు మసకబారుతోంది’’ అని తెలిపారు. 

Scroll to load tweet…

బీహార్‌షరీఫ్‌, ససారంలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతి చెందగా, పది మంది గాయపడిన ఘటనలపై బుధవారం బీహార్‌ అసెంబ్లీలో రచ్చ జరిగింది. అధికార మహాకూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ నినాదాలు చేసింది. దీనిని బీహార్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి అడ్డుకున్నారు. 

Mumbai Airport: ప్రయాణికులకు గమనిక! ఆ రోజు మూతపడనున్న ముంబై విమానాశ్రయం.. ఎందుకంటే..?

సభ వెలుపల బీహార్ సీఎం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతీ చోట శాంతి ఉందని అన్నారు. ‘‘ రెండు చోట్ల (నలంద, రోహ్తాస్) పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఇది పాలకుల వైఫల్యం కాదు. కుట్రలో భాగంగా కొందరు ఇదంతా చేస్తున్నారు. బిహార్ షరీఫ్ లో ఈ తరహా ప్రయత్నం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ విషయం వెలుగులోకి వస్తుంది’’ అని తెలిపారు.

ఏప్రిల్ 25నుంచి కేదార్ నాథ్ యాత్ర ప్రారంభం.. అందుబాటులో హెలికాప్టర్ సేవలు..

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నలంద, రోహ్తాస్ జిల్లాలో మత ఘర్షణలు, విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు బలగాలను పంపించింది.