Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక నుంచి బీజేపీ, కాంగ్రెస్ లను తరిమికొట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారు - హెచ్ డీ కుమారస్వామి

జేడీఎస్ అధినేత హెచ్ డీ కుమారస్వామి బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలను రాష్ట్ర ప్రజలు తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రస్తుత బీజేపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పారు. 

Kannadigas decided to throw out BJP and Congress from Karnataka - JDS chief HD Kumaraswamy..ISR
Author
First Published Mar 30, 2023, 4:12 PM IST

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్ డీ కుమారస్వామి అన్నారు. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ.. మాజీ సీఎం యడ్యూరప్పపై నిప్పులు చెరిగారు. వారికి 150కి పైగా సీట్లు వస్తాయని యడ్యూరప్ప ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించారు. డబ్బు విసిరి ఓట్లు కొనుక్కోవచ్చని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. 

వేధిస్తున్న వ్యక్తికి సర్‌ప్రైజ్ ఇస్తానని కళ్లకు గంతలు కట్టిన వివాహిత.. తల నరికి చంపేసిన భర్త

ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా లేరని కుమారస్వామి అన్నారు. ‘‘బీజేపీ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేరు. రెండు జాతీయ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కన్నడిగులు నిర్ణయించారు’’ అని తెలిపారు. కాగా.. ఇటీవల కాంగ్రెస్, బీజేపీ తమను సంప్రదించాయని కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు. 

రాహుల్ గాంధీ అనర్హతపై జర్మనీ స్పందన.. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం..

జేడీఎస్ అధినేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘‘మేం ఆయనకు ఫోన్ చేయలేదు, మాతో రమ్మని అడగలేదు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ తమ ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని చెప్పారు. 

ఇదిలా ఉండగా.. 2018 కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో తక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరించింది. కాంగ్రెస్ తో జేడీఎస్ ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకుంది. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ప్రభుత్వం ఒక ఏడాది మాత్రమే కొనసాగింది. 2019 జూలైలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చింది.

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే మొబైల్ ఫోన్‌లో పోర్న్!.. వీడియో వైరల్

ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 119, కాంగ్రెస్ కు 75 సీట్లు ఉన్నాయి. జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారాన్ని నిలుపుకొని, దాదాపు నాలుగు దశాబ్దాల ట్రెండ్ ను తిప్పికొట్టి చరిత్రను లిఖించడానికి బీజేపీ భావిస్తుండగా, కాషాయ ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మొత్తం ఆ రాష్ట్ర అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ అయిన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజారిటీ మార్కు 113 సీట్లను గెలవాల్సి ఉంటుంది. 2018 ఎన్నికల్లో 104 సీట్లు గెలుచుకుని సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.

ఢీ అంటే ఢీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దారామయ్యపై యెడియూరప్ప తనయుడు పోటీ!

కేంద్ర ఎన్నికల కమిషన్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం షెడ్యూల్ ను ప్రకటించింది. మొత్తం 224 స్థానాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించనుంది. మే 10న పోలింగ్ ఉండగా.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది. ఏప్రిల్ 13 గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 20వ తేదీ నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ కాగా.. ఏప్రిల్ 21 వరకు నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios