Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే మొబైల్ ఫోన్‌లో పోర్న్!.. వీడియో వైరల్

త్రిపుర అసెంబ్లీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే ఫోన్‌లో పోర్నోగ్రఫిక్ కంటెంట్ చూస్తూ పట్టుబడ్డాడు. ఆయన వెనుక నుంచి తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఆరోపణలపై ఆయన ఇంకా స్పందించలేదు.
 

tripura bjp mla jadav lal nath watching pornographic video in state assembly kms
Author
First Published Mar 30, 2023, 3:10 PM IST

గువహతి: త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ రాష్ట్ర అసెంబ్లీలో పోర్న్ చూస్తున్నట్టు ఓ వీడియోలో కనిపిస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఆయన ఫోన్‌లో పోర్న్ వీక్షిస్తున్నట్టు చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. త్రిపురలోని బాగ్‌బాసా నియోజకవర్గానికి జాదవ్ లాల్ నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వైరల్ చర్చనీయాంశమైంది. కొందరు దాన్ని పోర్న్ అని చెబుతుండగా.. మరికొందరు అది సోషల్ మీడియాలోని షార్ట్ వీడియోస్ అని పేర్కొంటున్నారు. ఏదైనా రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ జరుగుతుండగా అందులో పాల్గొనకుండా ఇలా మొబైల్ ఫోన్‌తో ఆటలేంటని ఇంకొందరు విమర్శిస్తున్నారు.

అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరుగుతుండగా జాదవ్ లాల్ నాథ్ వెనుక కూర్చున్న ఓ వ్యక్తి ఆయనను వీడియో తీసినట్టు తెలుస్తున్నది. అందులో జాదవ్ లాల్ నాథ్ తన ఫోన్‌లో వీడియో ఫీడ్‌ను స్క్రోల్ చేస్తూ కనిపించారు. కొన్ని వీడియోలను ఉద్దేశ్యపూర్వకంగానే చూస్తున్నట్టు ఉన్నది. అందులో కొన్ని వీడియోలు పోర్నోగ్రఫిక్ కంటెంట్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది.

Also Read: ఢీ అంటే ఢీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దారామయ్యపై యెడియూరప్ప తనయుడు పోటీ!

ఆ ఎమ్మెల్యే నుంచి వివరణ కోరుతూ బీజేపీ సమన్లు పంపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ ఇంకా స్పందించలేదు. అసెంబ్లీ సెషన్ ముగియగానే ఆయన అసెంబ్లీ ప్రాంగణం నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios