Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ అనర్హతపై జర్మనీ స్పందన.. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం..

పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్ గాంధీ తన లోకసభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు. దీంతో జర్మనీ బుధవారం స్పందించింది. రాహుల్ గాంధీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ట్వీట్టర్ ద్వారా గురువారం మాటల యుద్ధం కొనసాగించారు. 

Germanys response to Rahul Gandhi's disqualification.. War of words between BJP and Congress..ISR
Author
First Published Mar 30, 2023, 3:27 PM IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్ సభ సభ్యుడిగా అనర్హులుగా ప్రకటించడంపై తలెత్తిన వివాదంపై జర్మనీ బుధవారం స్పందించింది.ఈ కేసులో న్యాయస్వేచ్ఛ, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు వర్తింపజేయాలని జర్మనీ వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ అనర్హతపై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘‘భారత ప్రతిపక్ష రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన  తీర్పుతో అతని పార్లమెంటరీ ఆదేశాన్ని సస్పెండ్ చేయడం గురించి మేము గమనించాము. మాకున్న సమాచారం ప్రకారం..రాహుల్ గాంధీ తీర్పుపై అప్పీల్ చేయగల స్థితిలో ఉన్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. 

ఢీ అంటే ఢీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దారామయ్యపై యెడియూరప్ప తనయుడు పోటీ!

అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్వాగతించగా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులను ఆహ్వానించిన రాహుల్ గాంధీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి మండిపడ్డారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.

రాహుల్ గాంధీని వేధించడం ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతుందో గమనించినందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. దిగ్విజయ్ సింగ్ ట్వీట్ పై స్పందించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి విదేశీ శక్తులను ఆహ్వానిస్తున్న రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.‘‘ భారత న్యాయవ్యవస్థను విదేశీ జోక్యం ప్రభావితం చేయదని గుర్తుంచుకోండి. 'విదేశీ ప్రభావాన్ని' భారత్ ఇక సహించదు ఎందుకంటే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జీ’’ అని ఆయన ట్వీట్ చేశారు.

ప్రజలను తప్పుదోవ పట్టించే బదులు అదానీ అంశంపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు రిజిజు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేరా డిమాండ్ చేశారు. ‘‘మిస్టర్ రిజిజు, ప్రధాన సమస్య నుంచి ఎందుకు పక్కదారి పట్టాలి? అదానీ గురించి రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే బదులు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’’ అని ఖేరా ట్వీట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios