Asianet News TeluguAsianet News Telugu

Repeal of Farm Laws : మరోసారి నోరు పారేసుకున్న కంగనా.. మోదీ చేసింది తప్పంటూ వివాదాస్పద వ్యాఖ్యలు..

గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అటు ప్రతిపక్షాలు, ఇటు రైతు ఆందోళనకారులు స్వాగతించారు. అయితే, కంగనా రనౌత్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం పూర్తిగా అన్యాయమంటూ పేర్కొంది.

kangana ranaut reacts to repeal of farm laws, says shamful and absolutely unfair
Author
Hyderabad, First Published Nov 19, 2021, 2:29 PM IST

ముంబై : ఎప్పుడూ ఏదో రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిరాకు తెప్పించే కంగనా మరోసారి తన నోటికి పని చెప్పింది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం మీద దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్న తరుణంలో నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలు రద్దు చేయనున్నామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం మీద Kangana Ranaut స్పందించింది. 

వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం పూర్తిగా అన్యాయమంటూ పేర్కొంది. దీంతో Netizens మండిపడుతున్నారు. Guru Nanak Jayanti సందర్భంగా శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని Modi వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అటు ప్రతిపక్షాలు, ఇటు రైతు ఆందోళనకారులు స్వాగతించారు. అయితే, కంగనా రనౌత్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. 

పోరాటాల శక్తి నిరూపించిన ఫలితమిది అంటూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ను షేర్ చేసిన కంగనా Repeal of farm laws చాలా విచారకరం, అవమానం. పూర్తిగా అన్యాయం అని వ్యాఖ్యానించింది. అంతేకాదు పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధి పోరాటం చేస్తున్న వ్యక్తులు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే, ఇది కూడా జిహాదీ దేశమే. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు అంటూ సెటైర్స్ వేసింది. 

కాగా బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది కాలంగా వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘ పోరాటాన్ని చేపట్టి సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ చట్టాలను రానున్న Parliament సమావేశాల్లో రద్దు చేసేలా మోదీ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. అన్నదాతలు సాధించిన చారిత్రక విజయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్ర్యం’.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఫైర్

కాగా, ఇటీవలే బాలీవుడ్ నటి Kangana Ranautకు Padma Shri Award ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె మాట్లాడుతూ.. బ్రిటీషర్లకు కొనసాగింపుగానే 1947లో కాంగ్రెస్ పాలన సాగిందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని నోరుపారేసుకున్నారు. అంతేకాదు, 1947లో బ్రిటీషర్లు భిక్షం వేశారని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఆమెపై బీజేపీ సహా ఇతర అన్ని పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పద్మ శ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశారు.

‘ఆ ఇంటర్వ్యూలోనే తాను 1857 సంగ్రామం గురించి స్పష్టంగా ప్రస్తావించాను. వారితోపాటు సుభాష్ చంద్రబోస్, లక్ష్మీబాయి, వీర్ సావర్క్‌ల త్యాగాలనూ మాట్లాడాను. 1857లో జరిగిన పోరాటం తెలుసు కానీ, 1947లో ఎలాంటి యుద్ధం జరిగిందో నాకు తెలియదు. దీనిపై నాకు అవగాహన కలిగిస్తే నా పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇస్తా.. అంతేకాదు, నా వ్యాఖ్యలకు క్షమాపణలూ చెబుతా. దయచేసి నాకు హెల్ప్ చేయండి’ అంటూ పోస్టు చేశారు. ఈ పోస్టులో ఆమె కాంగ్రెస్‌ను ‘అడుక్కుతినేది’ అని పేర్కొనేట్టుగా రాసుకొచ్చారు. ఓ చరిత్ర పుస్తకం నుంచి కొన్ని ఫొటోలను పోస్టు చేశారు. కానీ, ఆ పుస్తకం పేరు పేర్కొననేలేదు.

దీనిమీద బీజేపీ నేతలతో సహా పలువురి నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా తాజాగా ఏకంగా ప్రధాని మీదనే సెటైర్లు వేసింది కంగనా. 

Follow Us:
Download App:
  • android
  • ios