కరోనా దెబ్బ: తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్ బంపర్ ఆఫర్!
మరిన్ని క్వారంటైన్ సెంటర్ల అవసరం ఏర్పడుతున్న వేళ రాజకీయ నాయకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్రైస్తవ ప్రవక్త కేఏ పాల్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తన వంతుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు.
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ భారతదేహసంపై కూడా తన పంజాను విసరడం ఆరంభించింది. నేటి ఉదయం మహారాష్ట్రలో తాజాగా మరో కరోనా మరణం సంభవించడంతో దేశమంతటా హై అలెర్ట్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాద్యమైనాన్ని చర్యలను తీసుకుంటున్నాయి.
ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయడం దగ్గరి నుండి మొదలు ప్రజల్లో చైతన్యం కల్పించడం వరకు సాధ్యమైనన్ని చర్యలన్నిటిని తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా షట్ డౌన్ నడుస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలనే వాయిదా వేశారు.
Also read: భారత్ లో మూడో మరణం... కరోనా సోకి ముంబయిలో వ్యక్తి మృతి
ఇక ఇలా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం, కరోనా అనుమానితుల సంఖ్యా ఎక్కువవుతుండడంతో ప్రభుత్వాలు ఎక్కువ ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయిపోయాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనంతగిరి సమీపంలోని హరిత రిసార్టుని క్వారంటైన్ సెంటర్ గా మార్చివేసింది.
ఇలాంటి నేపథ్యంలో మరిన్ని క్వారంటైన్ సెంటర్ల అవసరం ఏర్పడుతున్న వేళ రాజకీయ నాయకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్రైస్తవ ప్రవక్త కేఏ పాల్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తన వంతుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు.
తమ చారిటీ సిటీల్లోని గదులను అవసరమనుకుంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకోవచ్చునని ఆయన అన్నారు. సంగారెడ్డి దగ్గర్లోని చారిటీ సిటీలో 300 గదులు ఉన్నాయని, విశాఖపట్నం సమీపంలోని చారిటీ సిటీలో 100 గదులు అందుబాటులో ఉన్నాయని కేఏ పాల్ అన్నారు. ఈ విషయాన్నీ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
Also read: కరోనాకి పారసెటమాల్... సీఎం జగన్ పై సాధినేని యామిని ఫైర్